@23: 'రాజా సాబ్' లుక్‌తో కిక్ ఇచ్చిన మారుతి!

అంటే, 23 ఏళ్ల మైల్‌స్టోన్ రోజే 'రాజా సాబ్' షూటింగ్ ఫినిష్ కావడం ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్. ఇక కొత్త పోస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.;

Update: 2025-11-11 16:11 GMT

రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 23 ఏళ్లు పూర్తయింది. 2002లో 'ఈశ్వర్'గా మొదలైన ఈ ప్రయాణం, బాహుబలి, సలార్, కల్కి లాంటి సినిమాలతో "ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్" రేంజ్‌కు చేరింది. ఈ స్పెషల్ డే సందర్భంగా, ఏదైనా అప్‌డేట్ వస్తుందా అని ఉదయం నుంచి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ల వెయిటింగ్‌కు పర్ఫెక్ట్ ట్రీట్ ఇస్తూ, డైరెక్టర్ మారుతి "ది రాజా సాబ్" టీమ్ నుంచి ఒక సాలిడ్ సర్‌ప్రైజ్ వదిలాడు.

 

ఫ్యాన్స్ కోసం ఒక సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేయడమే కాకుండా, డైరెక్టర్ మారుతి తన ట్వీట్‌లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. "23 ఏళ్ల క్రితం ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే రోజున ఆయన 'ది రాజా సాబ్'లో తన జర్నీని ముగిస్తున్నారు (షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నారు). ఈ విక్టోరియస్ జర్నీలో భాగం కావడం నా అదృష్టం" అంటూ మారుతి ట్వీట్ చేశాడు.

అంటే, 23 ఏళ్ల మైల్‌స్టోన్ రోజే 'రాజా సాబ్' షూటింగ్ ఫినిష్ కావడం ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్. ఇక కొత్త పోస్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత కొన్నేళ్లుగా ప్రభాస్‌ను హెవీ, డార్క్, ఇంటెన్స్ యాక్షన్ రోల్స్‌లో చూసిన ఫ్యాన్స్‌కు, ఈ పోస్టర్ కళ్లకు పండగలా ఉంది. స్టైలిష్ రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్, కూలింగ్ గ్లాసెస్, వెనుక తన గ్యాంగ్‌తో నడిచి వస్తున్న ప్రభాస్ లుక్.. పక్కా "వింటేజ్ రెబల్ స్టార్" వైబ్‌ను తెచ్చేసింది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో మిస్ అవుతున్న ఆ ఎనర్జీ, ఆ స్వాగ్ ఈ పోస్టర్‌లో ఫుల్లుగా లోడ్ అయి ఉన్నాయి.

రాజా సాబ్ కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ ఎనర్జీతో ఉంటుంది అని మారుతి గట్టిగా ప్రామిస్ చేశాడు. ఈ పోస్టర్ ఆ ప్రామిస్‌కు ఫస్ట్ శాంపిల్ లా ఉంది. ఫ్యాన్స్ ప్రేమ, అసహనం తనకు తెలుసని, బెస్ట్ అనేలా తప్పకుండా సినిమా ఇస్తామని మారుతి చెప్పడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ది రాజా సాబ్ 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

'కల్కి' లాంటి భారీ సినిమా తర్వాత, ఇలాంటి ఫుల్ ఎనర్జిటిక్, ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్నారు. ఓవరాల్‌గా, ఈ 23 ఏళ్ల సెలబ్రేషన్.. ఫ్యాన్స్‌కు డబుల్, ట్రిపుల్ హ్యాపీనెస్‌ను ఇచ్చింది. ఒకవైపు షూటింగ్ ఫినిష్ కావడం, మరోవైపు ఫ్యాన్స్ కోరుకుంటున్న వింటేజ్ లుక్ పోస్టర్, ఇంకోవైపు పర్ఫెక్ట్ ఫెస్టివల్ రిలీజ్ డేట్.. 'ది రాజా సాబ్' టీమ్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్, సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారెంటీ అని అనిపిస్తోంది.

Tags:    

Similar News