బాహుబలి : ది ఎటర్నల్ వార్ ప్రకటన.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్
ప్రెస్టీజియస్ 'ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026'లో ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందని చెప్తూ ప్రభాస్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్‌ను గ్లోబల్ వైడ్‌గా మార్చేసిన సినిమా 'బాహుబలి'. ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ నుంచి 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' అనే క్రేజీ 3D యానిమేటెడ్ సిరీస్ రాబోతోంది. దీని గురించి ప్రభాస్ తాజాగా సోషల్ మీడియాలో ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. ప్రెస్టీజియస్ 'ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026'లో ఈ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిందని చెప్తూ ప్రభాస్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం..
అంతర్జాతీయ వేదికపై 'బాహుబలి':
యానిమేషన్ ప్రపంచంలో 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్'గా భావించే ఆన్సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' సెషన్స్‌లో 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' ప్రాజెక్ట్‌ను ప్రదర్శించారు. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. "టీమ్ చాలా స్పెషల్‌గా బిల్డ్ చేస్తోంది. ప్రపంచం మొత్తానికి ఇది చూపించడానికి నేను ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను" అని రాసుకొచ్చాడు. ఇక ఈ ప్రదర్శన ద్వారా ఇంటర్నేషనల్ క్రిటిక్స్‌కు ఈ సినిమా విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో ఫస్ట్ లుక్ వచ్చింది..
సరికొత్తగా కాస్మిక్ వార్ స్టోరీ:
ఈ యానిమేటెడ్ ఎపిక్‌ను ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్ ఏకంగా రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత.. దేవుళ్లకు, అసురులకు మధ్య జరిగే ఒక మహా విశ్వ యుద్ధంలోకి బాహుబలి ఎలా వెళ్లాడనే పాయింట్‌తో 14 విభిన్న లోకాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇక భారతీయ పురాణాలను, హై ఫాంటసీని మిక్స్ చేసి రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ ప్రభాస్ వాయిస్:
ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఐకానిక్ క్యారెక్టర్స్ అయిన బాహుబలికి ప్రభాస్, రాజమాత శివగామికి రమ్యకృష్ణ మళ్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అలాగే ఆస్కార్ విన్నర్ ఎం.ఎం. కీరవాణి ఈ సిరీస్‌కు మ్యూజిక్ అందిస్తున్నారు. దీనితో పాటు జూన్ 26, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో 'బాహుబలి: ది టార్చ్ బేరర్' అనే డాక్యు-సిరీస్ కూడా రిలీజ్‌కు రెడీగా ఉంది.
బాహుబలి ఫ్యాన్స్‌కు రాబోయే రోజుల్లో ఫుల్ ఫీస్ట్ ఖాయంగా కనిపిస్తోంది. ప్రభాస్ వాయిస్‌తో వస్తున్న ఈ భారీ 3D యానిమేటెడ్ సాగా 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి క్రియేట్ చేసిన ఈ వండర్ వరల్డ్.. యానిమేషన్ రూపంలో గ్లోబల్ వైడ్‌గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.