పాత పరిచయాలతో మళ్లీ ప్రయత్నాలా?
పూజాహెగ్డే కోలీవుడ్ లో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. `రెట్రో` సినిమాతో అమ్మడు మళ్లీ రీలాంచ్ అయింది.;
పూజాహెగ్డే కోలీవుడ్ లో కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. 'రెట్రో' సినిమాతో అమ్మడు మళ్లీ రీలాంచ్ అయింది. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. సక్సెస్ తో కంబ్యాక్ అవ్వాలనుకున్న పూజకు అలా షాక్ తగిలింది. ప్రస్తుతం అక్కడే విజయ్ హీరోగా నటిస్తన్న `జననాయగన్` లో నటిస్తోంది.తాజాగా ఈ సినిమాలో అమ్మడి పోర్షన్ పూర్తయింది. ప్రస్తుతం `కాంచన 4` లో నటిస్తుంది.
ఇది కూడా పూర్తయితే పూజా అక్కడ ఖాళీ అయిటన్లే. కొత్త సినిమాలేవి చేతిలో లేవు. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటిస్తోన్న `కూలీ`లో స్పెషల్ అప్పిరియన్స్ మాత్రమే ఇస్తుంది. ఈ నేపథ్యంలో పూజాహెగ్డే టాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పాత పరిచయాల్ని మళ్లీ టచ్ లో పెడు తోందిట. పాత మేనేజనర్లకు టచ్ లోకి వెళ్లి యోగక్షేమాలు అడిగి ఇండస్ట్రీ స్థితి గతల గురించి ఆరా తీస్తుందిట.
అలాగే కొంత మంది దర్శక, నిర్మాతలకు కూడా టచ్ లో వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి తెలిసింది. మరి ఈ పాత పరిచయాలు కొత్త అవకాశాలు తెచ్చి పెడతాయా? లేదా? అన్నది చూడాలి. పూజాహెగ్డే టాలీవుడ్ ను వదిలేసి మూడేళ్ల అవుతుంది. `ఆచార్య` తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అప్పటికీ కొంత మంది స్టార్స్ తో అవకాశాలు వచ్చినా? వాటిని కాదని బాలీవుడ్ కి వెళ్లింది.
కెరీర్ అక్కడే ప్లాన్ చేసుకుని స్థిరపడాలని ప్లాన్ చేసుకుంది. కానీ అమ్మడి ప్లానింగ్ తల్లకిందులైంది. అక్కడ సరైన సక్సెస్ లు పకడపోవడంతో వెంటనే కోలీవుడ్ వైపు టర్న్ తీసుకుంది. లక్కీగా ఆ సయంలో అవ కాశాలు రావడంతో చేతిలో ఈ మాత్రం సినిమాలతోనైనా బిజీగా ఉంది. లేదంటే పూజాహెగ్డే రిటైర్మెంట్ ప్రచారం తెరపైకి వచ్చేది.