బుట్ట‌బొమ్మ తొలిసారి హ‌ద్దులు చెరిపేసిందా?

బుట్టబొమ్మగా ఫేమస్ అయిన పూజాహెగ్డే కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మకు కొంతకాలంగా అదృష్టం కలిసిరావడం లేదు.;

Update: 2026-05-10 13:30 GMT

బుట్టబొమ్మగా ఫేమస్ అయిన పూజాహెగ్డే కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఒకప్పుడు వరుస విజయాలతో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మకు కొంతకాలంగా అదృష్టం కలిసిరావడం లేదు. తెలుగు,తమిళ్ లో కొన్ని సినిమాలు చేతిలో ఉన్నా? అవి రిలీజ్ అయి స‌క్సెస్ అయ్యే వ‌ర‌కూ గానీ అమ్మ‌డి కెరీర్ ఎలా ఉంటుంద‌న్న‌ది క్లారిటీ రాదు. ప్ర‌స్తుతం వరుణ్ ధావన్ సరసన `హై జవాని` అనే హిందీ చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమాతోనైనా బాలీవుడ్ లో మ‌ళ్లీ స‌క్సెస్ అందుకోవాల‌ని ఆశ‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించి ముంబై వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

పూజా హెగ్డే ఈ చిత్రం కోసం గ్లామర్ హద్దులను చెరిపేసి నటిప‌స్తుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తన సినిమాల్లో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇచ్చే పూజా ఈ హిందీ ప్రాజెక్ట్ కోసం మరింత బోల్డ్‌గా కనిపించబోతోందని సమాచారం. బాలీవుడ్ నెటిజన్లను , యువతను ఆకట్టుకోవడానికి ఆమె ఈ విధమైన మేకోవర్ ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. `హై జవాని` చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. వరుణ్ ధావన్ వంటి ఎనర్జిటిక్ హీరో సరసన పూజా నటిస్తుండటంతో ఇద్ద‌రి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద‌నే అంచ‌నా లుంటాయి.

ముఖ్యంగా పాటల్లో , కొన్ని కీలక సన్నివేశాల్లో పూజా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్లామర్ యాంగిల్‌ను ప్రదర్శించబోతోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. న‌ట‌న‌కే ప‌రిమితం కాకుండా బోల్డ్ యాంగిల్ తోనైనా తాను అనుకున్న‌ది సాధించ‌ల‌నే ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తుంది. ప్రచార చిత్రాలు , లీక్ అయిన వార్తలు మాత్రం అమ్మ‌డు అందాల ఆరబోతపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. సౌత్ సినిమాల్లో పద్ధతిగా క‌నిపించి మెప్పించిన భామ నార్త్ మార్కెట్ కోసం ఇలా రూట్ మార్చడం చర్చనీ యాంశమైంది. మారుతోన్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో భాగంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

వరుస పరాజయాలు ఎదురైనప్పుడు నటీనటులు ఇమేజ్‌ను మార్చుకోవడం సహజం. పూజా హెగ్డే కూడా అదే బాటలో పయనిస్తుంది. `హై జవాని` సక్సెస్ ఆమె బాలీవుడ్ కెరీర్‌కు ఊపిరి పోయడమే కాదు. మళ్ళీ టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించడానికి దోహదప డుతుందని అమ్మ‌డు బ‌లంగా న‌మ్ముతుంది. షూటింగ్ దశలోనే ఇంతటి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మొత్తంగా పూజా హెగ్డే కెరీర్ గ్రాఫ్‌ను మళ్ళీ పైకి తీసుకెళ్లడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. హద్దులు చెరిపేయడం అనేది గ్లామర్ పరంగానే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉంద‌నే సంకేతంగా భావించొచ్చు.

Tags:    

Similar News