స్టన్నింగ్ లుక్ లో సెల్ఫీ ఫోజులతో ఆకట్టుకుంటున్న బుట్ట బొమ్మ!
అందులో భాగంగానే తాజాగా బ్లూ అవుట్ ఫిట్ లో సెల్ఫీ ఫోజులతో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న పూజా హెగ్డే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకొని ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సరైన అవకాశాలు లేక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక ఒక్క హిట్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం హిందీలో, తమిళ్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఇటు ఇంస్టాగ్రామ్ వేదికగా కూడా అందాలు ఆరబోస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకునే పనిలో పడింది.
అందులో భాగంగానే తాజాగా బ్లూ అవుట్ ఫిట్ లో సెల్ఫీ ఫోజులతో షేర్ చేసిన కొన్ని ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మిడ్ నైట్ బ్లూ ఎంబ్రాయిడరీ లెహంగా ధరించిన ఈమె.. స్ట్రా ప్లేస్ బ్లౌజ్ ధరించి, డైమండ్ చౌకర్ తో.. సహజ సిద్ధమైన స్ట్రెయిట్ హెయిర్ తో తన అద్భుతమైన మేకోవర్ ను పూర్తి చేసింది. వ్యానిటీ మిర్రర్లో సెల్ఫీ ఫోజులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి .ఇదిలా ఉండగా ఈమె హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటిస్తోంది. జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన వావ్ పాట ఇప్పటికే లక్షలాది వీక్షణలను దాటి అన్నిచోట్ల ట్రెండింగ్ లో నిలిచింది. బాలీవుడ్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా ఈ పాటకు విపరీతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఇందులో ఈమెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్గా నటిస్తోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు దిగ్గజ దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడైన నటుడు రోహన్ మెహ్రాతో డేటింగ్ చేస్తోందని పుకార్లు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని అయితే ఈ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించడం లేదని చెప్పవచ్చు. ఇకపోతే వీరు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా ఇద్దరు ముంబైలోనే కలిసి ఉండటం.. పైగా కలిసి వెకేషన్ లకు, పార్టీలకు వెళ్లడం చూసి నెటిజన్స్ వీరిద్దరు నిజంగానే డేటింగ్ లో ఉన్నారనే కామెంట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో నటిస్తోంది. జూన్ 5న ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే విజయ్ దళపతి జననాయగన్ చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా మే నెలలో విడుదల కానున్నట్లు సమాచారం. ఇక అసలే సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూజా హెగ్డే ఈ రెండు చిత్రాలతో మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు