నటుడుగా ఎంట్రీ ఇస్తున్న ప్రధాని మాజీ బాడీగార్డ్..అసలు ట్విస్ట్ ఇదే!
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్ , రా ఏజెంట్ గా పని చేసిన లక్కీబిష్ట్ నటుడిగా అరంగేట్రం చేశారు.;
ముఖ్యంగా మిగతా రంగాలతో పోల్చుకుంటే సినీ రంగానికి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఒక్కసారి తమ పెర్ఫార్మెన్స్ తో ప్రతిభ చాటుకున్నారు అంటే.. ఇక చిరకాలం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది తెరపై నటులుగా ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.. అయితే ఈసారి ఏకంగా భారత ప్రధాని మోదీ మాజీ బాడీగార్డ్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసి, అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రియల్ జవాన్లకు సినిమాలలో అవకాశం కల్పిస్తూ.. ఒక అడుగు ముందుకి వేయడంతో ఆ చిత్ర బృందంపై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ప్రధాని మాజీ బాడీగార్డ్..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్ , రా ఏజెంట్ గా పని చేసిన లక్కీబిష్ట్ నటుడిగా అరంగేట్రం చేశారు. "సేన - గార్డియన్స్ ఆఫ్ ది నేషన్"వెబ్ సిరీస్ లో అతిధి పాత్రలో మెరిశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకే తాను ఈ సినిమా వెబ్ సిరీస్ లో నటించినట్లు లక్కీబిష్ట్ స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడుతూ.." నిజమైన సైనికుడిని తెరపై చూపించాలని ఆ వెబ్ సిరీస్ నిర్మాతలు భావించారు. నా మిలిటరీ నేపథ్యం, అనుభవం దృష్టా నాకు ఈ అవకాశం లభించింది. ముఖ్యంగా ఈ నటనా రంగం అనేది నాకు పూర్తిగా కొత్తది.. ఆ కొత్త అనుభవాన్ని ఇచ్చింది సినిమా రంగమే. నిజజీవితంలో మన విధులను మనం నిర్వర్తిస్తాము. క్షేత్రస్థాయిలో సైనికుడిగా ఉన్నప్పుడు మన భుజాలపై ఆ బాధ్యత చాలా ఉంటుంది. నిజమైన యుద్ధాలలో ఎన్నో త్యాగాలు, భయాలు ఉంటాయి. సైనికుడిగా నటించడం అంటే అలా భావోద్వేగాలను కెమెరా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి"అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు లక్కీ. ప్రస్తుతం తన కొత్త జర్నీ గురించి వెల్లడించడంతో అటు వెబ్ సిరీస్ మేకర్స్ పై కూడా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సేన -గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ వెబ్ సిరీస్..
ఇక సేన -గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే..ఇది ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది. విక్రమ్ సింగ్ చౌహన్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా.. యశ్పాల్ శర్మ, షిర్లే సేథియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు
సేన -గార్డియన్స్ ఆఫ్ ది నేషన్ స్టోరీ..
స్టోరీ విషయానికి చూస్తే కార్తీక్ అనే యువకుడు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారత సైన్యంలో చేరుతాడు. ఆ తర్వాత దేశానికి సేవ చేస్తూ ఉంటాడు.. ఆయన మిలిటెంట్లను ఎదుర్కొన్న తీరును దర్శకుడు అభినవ్ ఆనంద్ ఈ సిరీస్లో చూపించడం జరిగింది
ఎవరీ లక్కీ బీష్ట్?
లక్కీ బీష్ట్ విషయానికి వస్తే.. ఉత్తరాఖండ్ కు చెందిన భారత మాజీ స్పై, స్నైపర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండో గా పనిచేశారు. అంతేకాదు రాజ్నాథ్ సింగ్, ఎల్కే అద్వానీ తరుణ్ గోగాయ్ వంటివారికి బాడీగార్డ్ గా పనిచేసిన ఈయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ గా పని చేశారు. 2010లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియాలో పర్యటించినప్పుడు భద్రత బలగాలలో ఒకరిగా నిలిచారు. ముఖ్యంగా ఎన్నో ఏజెన్సీలలో పని చేసిన ఈయన దేశం తరఫున పలు ఆపరేషన్లలో కూడా పాల్గొని సత్తా చాటారు.