గ్లింప్స్ చూసే రైట్స్ కోసం పోటీ పడుతున్నారట..!

లేటెస్ట్ గా ఒక గ్లోబల్ స్టార్ సినిమా విషయంలో ఓటీటీ సంస్థల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని తెలుస్తుంది.;

Update: 2025-04-08 03:48 GMT

స్టార్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అంటే చాలు ఆ సినిమా రైట్స్ కోసం ముందే ఖర్చీఫ్ వేసేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక సూపర్ హిట్ బ్యానర్, పాన్ వరల్డ్ స్టార్ కాంబో అయితే అది ఇంకా ముందే బజ్ పెరుగుతుంది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే సినిమా రైట్స్ కోసం ప్రయత్నాలు జరుగుతాయి. లేటెస్ట్ గా ఒక గ్లోబల్ స్టార్ సినిమా విషయంలో ఓటీటీ సంస్థల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుందని తెలుస్తుంది. జస్ట్ గ్లింప్స్ చూసే సినిమా కొనేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయని తెలుస్తుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సన డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ చూసి సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసింది. ఈ పెద్ది చాలా పెద్ద స్థాయిలోనే రాబోతున్నాడని అర్ధమైంది. ఉప్పెన తీసిన బుచ్చి బాబు సెకండ్ సినిమానే అది కూడా రామ్ చరణ్ తో ఇంత అద్భుతమైన కథను తీయగలడా అని అనుకున్నారు.

కానీ మెగా ఫ్యాన్స్ గ్లింప్స్ చూశాక బుచ్చి టాలెంట్ ఏంటో అర్థమైంది. అంతేకాదు పెద్ది గ్లింప్స్ లో ఉన్న హై మూమెంట్స్ ఒక రేంజ్ లో ఉంటాయట. గ్లింప్స్ లో చూపించిన ఒక్క షాట్ మాత్రమే అదిరిపోగా అలాంటివి సినిమాలో బోలెడన్ని ఉన్నాయని అంటున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ కే ఫ్యూజులు అవుట్ అయ్యేలా చేశారు. కచ్చితంగా నెక్స్ట్ అప్డేట్స్ తో సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడుతుందని అంటున్నారు.

పెద్ది సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మధ్య గట్టి ఫైట్ జరుగుతుందట. మైత్రి మేకర్స్ మాత్రం ఎవరు ఎక్కువ ఇస్తే వారికే సినిమా అంటున్నాడట. ఆల్రెడీ పుష్ప 2 సినిమాను నెట్ ఫ్లిక్స్ కే ఇచ్చారు. సో పెద్ది రైట్స్ కూడా వారితోనే బేరసారాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ కూడా పెద్ది రైట్స్ కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ పెద్ది హంగామా ఎప్పుడన్నది చూడాలంటే నెక్స్ట్ మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే. పెద్ది సినిమా రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు సైతం తీసుకొచ్చేలా బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనందానికి తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Tags:    

Similar News