చరణ్ తప్ప ఎవరు న్యాయం చేయలేరేమో.. నేషనల్ అవార్డు గ్యారెంటీ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ పెద్ది థియేటర్స్ లో సందడి చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియా మూవీ పెద్ది థియేటర్స్ లో సందడి చేస్తోంది. రిలీజ్ కు ముందు వరకు సినిమా కథ, బుచ్చిబాబు సనా దర్శకత్వం, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ వంటి విషయాలపై చర్చ జరిగినా.. సినిమా చూసిన తర్వాత ఎక్కువ మంది మాట్లాడుకుంటున్న విషయం మాత్రం రామ్ చరణ్ నటన గురించే.
పెద్దిలో రామ్ చరణ్ కేవలం హీరోగా కనిపించలేదు.. పాత్రలో జీవించేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా మొత్తం ఆయన తన పాత్రలో పూర్తిగా ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమాలోని పాత్ర కోసం ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. చరణ్ మల్టీపుల్ యాంగిల్స్ లో కనిపించారని ప్రేక్షకులు చెబుతున్నారు.
కూలీగా కనిపించే సన్నివేశాల నుంచి స్పోర్ట్స్ ప్లేయర్ రోల్ వరకు ఆయన చూపించిన వేరియేషన్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కుస్తీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్ కోసం ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ పై క్లియర్ గా కనిపిస్తోందని అంటున్నారు. నిజానికి స్పోర్ట్స్ డ్రామాల్లో బాడీ చేంజ్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ విషయంలో రామ్ చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది.
కేవలం లుక్ మార్చుకోవడమే కాకుండా, పాత్రకు అవసరమైన ఎక్స్ప్రెషన్స్, వాకింగ్ స్టైల్, మాట్లాడే తీరు వంటి అంశాల్లోనూ భిన్నంగా కనిపించారని ప్రేక్షకులు పేర్కొంటున్నారు. అందుకే ఆ రోల్ నుమరో హీరో చేస్తే ఇదే ఎఫెక్ట్ వచ్చేదా అనే చర్చ సాగుతోంది. ఎమోషనల్ సీన్స్ లో చరణ్ యాక్టింగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్, స్పోర్ట్స్ సీన్స్ లో తన పవర్ ను చూపించిన ఆయన.. ఎమోషనల్ సీన్స్ లోనూ బాధను నేచురల్ గా వ్యక్తపరిచారట.
ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. కమర్షియల్ హీరోగా ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న రామ్ చరణ్.. ఇలాంటి కథను నమ్మి చేయడం గ్రేట్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాస్ ఎలిమెంట్స్ కు మాత్రమే పరిమితం కాకుండా, రోల్ కు ఇంపార్టెన్స్ ఉన్న కథను ఎంచుకోవడం ఆయన కెరీర్ లో కీలక నిర్ణయంగా మారవచ్చని సినీ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. అలా పెద్దిని చాలామంది చరణ్ వన్ మ్యాన్ షోగా చెబుతున్నారు. డ్యాన్సులు, యాక్షన్ సీన్స్, స్పోర్ట్స్ ఎపిసోడ్స్, ఎమోషనల్ మూమెంట్స్.. ఇలా ప్రతి విషయంలో కూడా ఆయన తన ముద్ర వేసినట్లు ప్రేక్షకుల రెస్పాన్స్ చెబుతోంది.
అందుకే ఇది ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని, నేషనల్ అవార్డు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఏదేమైనా పెద్ది సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా.. చివరకు చర్చ అంతా రామ్ చరణ్ నటన దగ్గరే ఆగుతోంది. పెద్ది తర్వాత ఆయన యాక్టర్ గా మరో మెట్టు ఎక్కాడనే అభిప్రాయం వినిపిస్తోంది. మరి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన పాత్రగా పెద్ది నిలుస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉన్నా.. ప్రస్తుతం మాత్రం చరణ్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.