పెద్ది మాస్ మాత్రమే కాదండోయ్..!

పెద్ది సినిమాలో కూడా కేవలం మాస్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ తో కూడా ఫ్యాన్స్ ని మెప్పిస్తాడని అంటున్నారు.;

Update: 2025-05-26 20:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది సినిమా మాస్ బొమ్మగా రాబోతుంది. పెద్ది ఫస్ట్ షాట్ చూస్తేనే చరణ్ ఊర మాస్ యాటిట్యూడ్ ఒక రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. తొలి సినిమా ఉప్పెన తీసిన బుచ్చి బాబు రెండో ప్రయత్నమే గ్లోబల్ స్టార్ తో ఇలాంటి సినిమా చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఐతే ఫస్ట్ షాట్ తో తన మాస్ డైరెక్షన్ స్టామినా తో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. తప్పకుండా సినిమా వేరే లెవెల్ సెట్ చేస్తుందని నమ్మకం కలిగించాడు.

పెద్ది సినిమా మాస్ అప్పీల్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో చరణ్ లుక్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉన్నాయి. ఐతే ఈ సినిమాలో ఎంత మాస్ ఉందో అదే రేంజ్ ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అసలే అతను సుకుమార్ శిష్యుడు ఎమోషన్ లో కూడా గురువుకి తగ్గ శిష్యుడు అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఉప్పెన లాంటి లవ్ స్టోరీలోనే హీరో హీరోయిన్ మధ్య లవ్ ఎమోషన్, ఫాదర్ డాటర్ మధ్య లవ్ ఎమోషన్ చాలా బాగా చూపించాడు.

పెద్ది సినిమాలో కూడా కేవలం మాస్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ తో కూడా ఫ్యాన్స్ ని మెప్పిస్తాడని అంటున్నారు. సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. ఆయనతో వచ్చే సీన్స్ తో పాటు చరణ్ క్యారెక్టర్ లో ఎమోషన్ ఆడియన్స్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. పెద్ది ఫస్ట్ షాట్ బ్లాక్ బస్టర్ అనిపించుకోగా కచ్చితంగా ఈ సినిమా చేసే సౌండ్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని మాత్రం అర్థమవుతుంది.

పెద్ది సినిమాలో చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో చరణ్ ఆట కూలీగా నటిస్తాడని తెలుస్తుండగా పెద్ది షాట్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చూపించాడు. ఏది ఏమైనా పెద్ది తో మరోసారి బాక్సాఫీస్ రికార్డుల మీద గురి పెట్టాడు చరణ్. 2026 మార్చి ఎండింగ్ రిలీజ్ ప్లాన్ చేసిన పెద్ది సినిమాతో భారీ టార్గెట్ నే పెట్టుకున్నారు చిర యూనిట్. మరి సినిమా ఏం చేస్తుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News