యూకే, ఐర్లాండ్‌ లోనూ పెద్ది అదే స్పీడ్.. ఇప్పటి వరకు ఎంతంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది.

Update: 2026-06-08 13:21 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లీడ్ రోల్ లో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది. జూన్ 3న ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం, జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై తొలి రోజు నుంచే భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మార్కెట్‌ తో పాటు ఓవర్సీస్‌ లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రత్యేకంగా యూకే, ఐర్లాండ్ మార్కెట్లలో పెద్ది ఓ రేంజ్ లో వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఆ చిత్రాన్ని ప్రత్యంగిరా సినిమాస్ విడుదల చేయగా, అడ్వాన్స్ బుకింగ్స్ నుంచి మంచి హైప్ కనిపించింది. తాజాగా విడుదల చేసిన వివరాల ప్రకారం యూకే, ఐర్లాండ్‌ లో సినిమా 3.25 లక్షల పౌండ్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఓవర్సీస్ మార్కెట్‌ లోనూ రామ్ చరణ్ మరోసారి తన పవర్ ను ప్రూవ్ చేసుకున్నారనే చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా పెద్ది కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో కొనసాగుతున్నాయి. విడుదలైన తొలి రోజే రూ.135.36 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఆ చిత్రం, తర్వాత రోజుల్లో అదే జోరు కంటిన్యూ చేసింది. రెండో రోజు రూ.46.44 కోట్లు, మూడో రోజు రూ.54.90 కోట్లు రాబట్టిన సినిమా, తొలి వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.292.5 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఆ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లతో పెద్ది ఈ ఏడాది అత్యంత వేగంగా వసూళ్లు సాధిస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం సినిమాకు కలిసొస్తుందని మూవీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్, ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇప్పుడు పెద్ది సినిమాకు అసలైన పరీక్ష వీక్ డేస్‌ లోనే ఉండనుంది. ఫస్ట్ వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించిన చాలా సినిమాలు సోమవారం నుంచి కాస్త తగ్గుదల ఎదుర్కొంటాయి. కానీ పెద్ది అదే రేంజ్ ఆక్యుపెన్సీ మాత్రం కొనసాగిస్తే, రెండో వీకెండ్ కు ముందే రూ.500 కోట్ల క్లబ్ దిశగా అడుగులు వేయగలదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతి బాబు సహా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. స్పెషల్ సాంగ్ లో శ్రుతి హాసన్ సందడి చేశారు.

Tags:    

Similar News