చరణ్ 'పెద్ది'.. కోలీవుడ్, బాలీవుడ్ సంగతేంటి?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్న ఆ సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధిస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఆ సినిమాకు అన్ని మార్కెట్లలో ఒకే రేంజ్ రెస్పాన్స్ రాలేదనే చర్చ జరుగుతోంది.
తెలుగు ప్రేక్షకులను స్ట్రాంగ్ గా ఆకట్టుకున్న పెద్ది మూవీకి కన్నడ, మలయాళ మార్కెట్లలో కూడా మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఎమోషన్స్ తో కూడిన కథ, రామ్ చరణ్ యాక్టింగ్ సినిమాకు మెయిన్ అసెట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తమిళనాడు, హిందీ మార్కెట్లలో పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. బాలీవుడ్ మార్కెట్ లో సినిమా ఆశించిన స్థాయిలో ఎఫెక్ట్ చూపలేదనే టాక్ వినిపిస్తోంది. విడుదలకు ముందు నార్త్ లో స్పెషల్ ప్రమోషన్లు నిర్వహించినప్పటికీ, అ రేంజ్ లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయిందని తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ వంటి సిటీల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ చేసినా, సినిమా చుట్టూ భారీ స్థాయి హైప్ ఏర్పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తమిళనాడులో కూడా పెద్ది ఆశించిన వసూళ్లు నమోదు చేయలేకపోయినట్లు సమాచారం. కోలీవుడ్ ప్రేక్షకుల్లో సినిమా గురించి పెద్దగా చర్చ జరగకపోవడం, ప్రమోషన్లు కూడా లిమిటెడ్ గానే ఉండటం దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. లోకల్ మార్కెట్ లో ఇప్పటికే ఉన్న కాంపిటేషన్, రీజనల్ టేస్ట్ కు తగ్గట్టు కంటెంట్ లేకపోవడం ఎఫెక్ట్ చూపినట్లు వార్తలు వస్తున్నాయి.
సినిమా కథ పూర్తిగా విలేజ్ ఎన్విరాన్మెంట్, లోకల్ కల్చర్, స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సాగడం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కానీ అదే ఎలిమెంట్స్ ఇతర ప్రాంతాల ప్రేక్షకులకు అంతగా రీచ్ కాలేకపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్లు స్టోరీలో కొత్తదనం తక్కువగా కనిపించిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది.
మరోవైపు ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగినా, సెకండ్ హాఫ్ కొంత నెమ్మదిగా ఉందనే రెస్పాన్స్ కూడా వినిపిస్తోంది. ఆ విషయం మౌత్ పబ్లిసిటీపై ఎఫెక్ట్ చూపి ఉండవచ్చని తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమాలకు అన్ని ప్రాంతాల్లో ఒకే రేంజ్ లో రెస్పాన్స్ రావడం కష్టమేనని, పెద్ది విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని ఇప్పుడు పలువురు అభిమానులు చెబుతున్నారు. అయితే కోలీవుడ్, బాలీవుడ్ మార్కెట్లలో ఆశించిన ఫలితాలు రాకపోయినా, తెలుగు రాష్ట్రాలు, ఇతర సౌత్ స్టేట్స్ లో లభిస్తున్న రెస్పాన్స్ తో పెద్ది బాక్సాఫీస్ రన్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో ఆ సినిమా.. ఇతర మార్కెట్లలోనూ పుంజుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.