పెద్ది ఢిల్లీ ఎపిసోడ్ కోసం పాత టెక్నాలజీ
లేటెస్ట్ కెమెరాలతో బెస్ట్ అవుట్ పుట్ రాబట్టొచ్చు. అయినా సరే మూవీ టీమ్ కావాలనే ఈ పాత పద్ధతికి వెళ్లడం వెనుక ఒక బలమైన కారణం దాగి ఉందట.
పెద్ది ప్రమోషన్స్ లో ఇప్పుడు అందరి దృష్టిని లాగుతున్న పాయింట్ ఒకటే.. అదే ఢిల్లీ ఎపిసోడ్. ఈ సీక్వెన్స్ గురించి సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇటీవల చెప్పిన విషయాలు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్ కోసం ఎలాంటి కృత్రిమ లైట్లు వాడకుండా కేవలం నాచురల్ లైటింగ్ తోనే షూట్ చేశారట. అంతేకాదు దీనికోసం ఏకంగా ఫిల్మ్ నెగిటివ్స్ వాడినట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. రత్నవేలు లాంటి టాప్ టెక్నీషియన్ దాదాపు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఈ పాత ఫార్మాట్ తో వర్క్ చేయడం సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచుతోంది.
ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీతో ఎలాంటి విజువల్స్ అయినా చాలా రిచ్ గా గ్లామరస్ గా తెరకెక్కించే అవకాశం సినిమా ఇండస్ట్రీలో ఉంది. లేటెస్ట్ కెమెరాలతో బెస్ట్ అవుట్ పుట్ రాబట్టొచ్చు. అయినా సరే మూవీ టీమ్ కావాలనే ఈ పాత పద్ధతికి వెళ్లడం వెనుక ఒక బలమైన కారణం దాగి ఉందట. కథలో వచ్చే ఆ పర్టిక్యులర్ జర్నీకి పక్కా రియలిస్టిక్ ఫీల్ తీసుకురావాలంటే డిజిటల్ గ్లామర్ సెట్ అవ్వదని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అందుకే ఆరియాలిటీ స్క్రీన్ మీద ఎలివేట్ అవ్వడం కోసమే ఈ ఫిల్మ్ నెగిటివ్స్ ను ఎంచుకున్నట్లు తెలిపారు.
డైరెక్టర్ బుచ్చిబాబు ప్రతీ ఇంటర్వ్యూలో కూడా పదే పదే ఈ ఢిల్లీ సీక్వెన్స్ గురించే చెబుతున్నాడు. అసలు ఒక పక్కా విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో దేశ రాజధాని ఢిల్లీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కథలో మేజర్ టర్నింగ్ పాయింట్ లాగా కనిపిస్తోంది. పల్లెటూరి మట్టిలో పెరిగిన ఒక సాధారణ అథ్లెట్, నేషనల్ లెవెల్ కు ఎలా ఎదిగాడు అనేదే ఈ కథకు మెయిన్ కోర్ పాయింట్. తన సొంత ఊరి వాతావరణం నుంచి ఒకేసారి ఢిల్లీ లాంటి మహానగరానికి వెళ్ళినప్పుడు ఆ క్యారెక్టర్ ఫేస్ చేసే సవాళ్లు ఈ ఎపిసోడ్ లో ఉండొచ్చు.
ఈ ఢిల్లీ ఎపిసోడ్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం మామూలుది కాదు. ఒక కుస్తీ ఫైటర్ గా కనిపించడం కోసం నెలల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారట. బాడీ లాంగ్వేజ్ నుంచి మాట తీరు వరకు ప్రతి చిన్న డీటైల్ మీద ప్రాణం పెట్టి పనిచేశారని మూవీ టీమ్ చెబుతూనే ఉంది. ఈ ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లోనే చరణ్ క్యారెక్టర్ కు సంబంధించిన అసలైన ఎమోషనల్ స్ట్రగుల్ స్క్రీన్ మీద కనిపించబోతోంది. ఒక పక్క చరణ్ నాచురల్ యాక్టింగ్, ఇంకో పక్క ఫిల్మ్ నెగిటివ్స్ తో వచ్చే రియలిస్టిక్ విజువల్స్ ఈ సీక్వెన్స్ ను సినిమాకే హైలైట్ గా మార్చబోతున్నాయి.
పెద్ది కంటెంట్ కేవలం మాస్ ఎలివేషన్స్ తో కాకుండా ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ జర్నీతో సాగబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఒక క్రీడాకారుడి విజయం వెనుక ఉన్న కన్నీళ్లు, కష్టాలను బుచ్చిబాబు తన మార్క్ రా అండ్ రస్టిక్ స్టైల్ లో తీర్చిదిద్దినట్లు సమాచారం. స్క్రిప్ట్ లో ఉన్న ఆ డెప్త్ వల్లే చరణ్ కూడా ఏకంగా మూడు సార్లు మేకోవర్ చేంజ్ చేసుకుని రిస్క్ లు తీసుకున్నారు. జూన్ 4న థియేటర్లలో ఈ ఢిల్లీ ఎపిసోడ్ పడినప్పుడు ఆడియన్స్ కు వచ్చే కిక్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది.