చరణ్ 'పెద్ది' లెక్కలు..పవన్, బన్నీ, తారక్ రికార్డులు బ్రేక్..

అ విజయానికి సినిమా బ్యాక్ డ్రాప్ కూడా ఒక మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ది కథ 1980ల నాటి కోస్తాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.

Update: 2026-06-06 07:41 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.135.36 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి దూసుకుపోతోంది. ఇప్పుడు రెండో రోజు కూడా అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ పలు రికార్డులను బ్రేక్ చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా కోస్తాంధ్రలోని ఆరు మెయిన్ ఏరియాల్లో పెద్ది రెండో రోజు వసూళ్లు ఇటీవల విడుదలైన పలువురు స్టార్ హీరోల సినిమాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రాల రెండో రోజు వసూళ్లను పెద్ది బ్రేక్ చేసినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కోస్తాంధ్రలో పెద్ది సినిమా లెక్కలు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ కెరీర్‌ లోనే కాకుండా ఇటీవలి కాలంలో విడుదలైన భారీ చిత్రాల లిస్ట్ లో పెద్ది సినిమా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోందని అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.

అ విజయానికి సినిమా బ్యాక్ డ్రాప్ కూడా ఒక మెయిన్ రీజన్ గా కనిపిస్తోంది. ఎందుకంటే పెద్ది కథ 1980ల నాటి కోస్తాంధ్ర విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఆ ప్రాంత కల్చర్, లైఫ్ స్టైల్, లోకల్ ఎమోషన్స్ ను బుచ్చిబాబు స్క్రీన్ పై చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రేక్షకులు సినిమాతో మరింతగా కనెక్ట్ కావడానికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సినిమాలో రామ్ చరణ్ పెద్ది పెహల్వాన్ పాత్రలో కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ అచ్చియమ్మగా నటించారు. కన్నడ స్టార్ శివ రాజ్‌ కుమార్ గౌర్నాయుడు పాత్రలో కీలకంగా కనిపించారు. అలాగే దివ్యేందు శర్మ, జగపతి బాబు, బొమన్ ఇరానీ, వీజీ చంద్రశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఆకట్టుకున్నారు.

కథ విషయానికి వస్తే.. తన గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో జీవించే ఓ సాధారణ యువకుడు కుస్తీ పోటీల ద్వారా ఎలా ఎదిగాడు? ఆ ప్రయాణంలో ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించాడు? అన్న అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్స్‌ ను మిక్స్ తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏదేమైనా భారీ ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కోస్తాంధ్రలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన పెద్ది బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. ముఖ్యంగా అదే ప్రాంత నేపథ్యంతో తెరకెక్కిన ఆ చిత్రం అక్కడ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందడం హాట్ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News