విదేశాల్లో భయంకర ఘటన.. పాయల్ రాధాకృష్ణ ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు ప్రేక్షకులను ప్రసన్న వదనం సినిమాతో అలరించిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ, విదేశాల్లో తనకు ఎదురైన కొన్ని భయానక అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Update: 2026-08-20 23:30 GMT

తెలుగు ప్రేక్షకులను ప్రసన్న వదనం సినిమాతో అలరించిన కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ, విదేశాల్లో తనకు ఎదురైన కొన్ని భయానక అనుభవాలను పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లండన్ వెళ్లిన సమయంలో తాను చావు అంచుల వరకు వెళ్లొచ్చానని, ఆ రాత్రి మళ్లీ బతికి సూర్యోదయం చూస్తానని అసలు అనుకోలేదని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాయల్ వెల్లడించిన ఈ షాకింగ్ నిజాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

హాస్టల్ గదిలో డ్రగ్స్, ఆయుధాలు ఉన్న వ్యక్తులు:

లండన్ పర్యటనలో భాగంగా పాయల్ ఒక షేరింగ్ హాస్టల్‌లో 8 బెడ్స్ ఉన్న రూమ్ లో బస చేశారు. అయితే రాత్రివేళ ఆ గదిలోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు నార్మల్‌గా లేరని, పూర్తిగా డ్రగ్స్ తీసుకుని ఉన్నారని ఆమె గమనించారు. వారి దగ్గర భయంకరమైన ఆయుధాలు కూడా ఉన్నాయని, దానికి తోడు భయంతో తనకు రాత్రంతా నిద్ర కూడా పట్టలేదని చెప్పారు. ఇక ఏమీ చేయలేని స్థితిలో ఆ రాత్రి వేళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపానని పాయల్ ఆవేదన వ్యక్తం చేశారు.

లండన్ క్యాబ్‌లో భయంకరమైన రాత్రి:

అక్కడే తనకు ఎదురైన మరో ఘటనను గుర్తుచేసుకుంటూ పాయల్ ఎమోషనల్ అయ్యారు. రాత్రివేళ హాస్టల్‌కు తిరిగొస్తున్నప్పుడు ఓ క్యాబ్ ఎక్కానని, ఆ డ్రైవర్‌కు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదని చెప్పారు. ఇక తాను చెప్పిన లొకేషన్‌కి కాకుండా వేరే నిర్మానుష్యమైన మార్గంలో తీసుకెళ్తుండటంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అక్కడ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో సూర్యాస్తమయం అవుతుందని, ఆ చీకట్లో డ్రైవర్ ఏమైనా చేస్తే? అసలు తిరిగి ఇండియాకు వెళ్తానా లేదా అని భయపడిపోయానని చెప్పారు.

పాస్‌పోర్ట్ చూసి ఐడెంటిఫై చేస్తారనుకున్నా:

తన దగ్గర ఉన్న డబ్బు కోసం ఆ డ్రైవర్ ఏమైనా చేస్తే, తన శవాన్ని గుర్తుపట్టడానికి కూడా చాలా టైమ్ పడుతుందని అనుకున్నానని పాయల్ అన్నారు. అప్పుడు తన దగ్గర ఉన్న పాస్‌పోర్ట్ చూసైనా ఫలానా అమ్మాయి అని గుర్తిస్తారని భావించినట్లు చెప్పారు. ఇక ఒక్కదాన్నే విదేశాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంత స్టుపిడ్ పనో ఆ తర్వాత నాకు అర్థమైందని, ఆ భయానక సంఘటనను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె ఎమోషనల్ అయ్యారు.

టాలీవుడ్‌లో బెస్ట్ మూవీస్:

పాయల్ రాధాకృష్ణ టాలీవుడ్‌లో సుహాస్ సరసన 'ప్రసన్న వదనం' చిత్రంతో పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'చౌర్యపాఠం', 'పాపం ప్రతాప్', 'అలా నిన్ను చేరి' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ భామ నటించిన 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' గత ఏడాది విడుదల అయింది.

ఇక ఒంటరిగా విదేశాలకు వెళ్లే అమ్మాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో పాయల్ అనుభవాలు తెలియజేస్తున్నాయి. చావు అంచుల వరకు వెళ్లి ధైర్యంతో ఆ పరిస్థితుల నుంచి బయటపడిన ఈ చిన్నది, మున్ముందు ఇలాంటి తప్పులు చేయనని చెబుతూనే టాలీవుడ్‌లో మంచి సినిమాలతో దూసుకుపోవాలని కోరుకుందాం.

Tags:    

Similar News