పల్లెటూరు సినిమాలపై ఎందుకు క్షమాపణ చెప్పాలి?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేల విడిచి సాము చేసే కథల కంటే మన ఊరు, మన మట్టి వాసనలు ఉట్టిపడే రూటెడ్ సినిమాల హవా నడుస్తోంది.

Update: 2026-08-20 22:30 GMT

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నేల విడిచి సాము చేసే కథల కంటే మన ఊరు, మన మట్టి వాసనలు ఉట్టిపడే రూటెడ్ సినిమాల హవా నడుస్తోంది. అయితే ఇలాంటి గ్రామీణ నేపథ్యంలో సినిమాలు తీయడం పట్ల కొందరు చేసే విమర్శలపై నిర్మాత సుప్రియ యార్లగడ్డ -వివేక్ కృష్ణాని ధీటుగా స్పందించారు. గ్రామీణ సంస్కృతిని తెరపై ఆవిష్కరించినందుకు తాము ఎందుకు? క్షమాపణలు చెప్పాలని సూటిగా ప్రశ్నించడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని లేదా ప్రాంతాన్ని టార్గెట్ చేసేలా సినిమాలు వస్తున్నాయనే? ఆరోపణలపై వారు స్పందించారు.

కళాకారులు కథను నమ్మే సినిమాలను తీస్తారని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థి తులను, అక్కడి జీవితాలను వెండితెరపై చూపించడం తప్పు ఎలా? అవుతుందని వాదించారు. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల భావోద్వేగాలను ప్రతిబింబించే కథలను చెప్పడంలో ఎలాంటి తప్పులేదని దాని కోసం ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిన తర్వాత సిటీ బ్యాక్‌డ్రాప్ సినిమాలే ట్రెండ్‌గా మారాయనే అపోహను ఈ సందర్భంగా కొట్టి పారేశారు. నేడు ప్రేక్షకులు గ్లామర్ హంగులకంటే తమ జీవితాలకు దగ్గరగా ఉండే సహజమైన కథలకే బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు.

`పల్లెటూరు` నేపథ్యం ఉన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్న తీరే దీనికి స్పష్టమైన నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలకు నిర్మాతలు ముందుకు రావడంపై వస్తున్న విమర్శలను కూడా వారు తోసి పుచ్చారు. వాణిజ్యపరమైన లెక్కలకంటే మంచి కథను ప్రేక్షకులకు చేరవేయాలనే తపనతోనే ఇలాంటి ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నంత కాలం ఇలాంటి నేటివిటీ చిత్రాల ప్రయాణం ఆగదని ధీమా వ్యక్తం చేశారు.

ఒక ప్రాంతీయ సంస్కృతిని లేదా గ్రామీణ జీవన విధానాన్ని చూపించేటప్పుడు కొంత విమర్శలు రావడం సహజమే అయినా? వాటిని భయంతో ఆపలేమని స్పష్టం చేశారు. క్రియేటివ్ ఫ్రీడమ్‌కు భంగం కలిగించేలా కొందరు చేసే కామెంట్స్‌ను తాము పట్టించుకోబోమని.. భవిష్యత్తులోనూ ఇలాంటి విభిన్నమైన కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని స్పష్టం చేశారు. రూటెడ్ సినిమాలపై వ‌స్తోన్న విమర్శలకు సుప్రియ యార్లగడ్డ - వివేక్ కృష్ణాని ఇచ్చిన ధీటైన సమాధానం టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపింది. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు ఎలాంటి హద్దులు ఉండవని.. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కథలను ఆదరిస్తారని ఈ చర్చ మరోసారి నిరూపించింది.

Tags:    

Similar News