• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ ఓజీ.. సరైన టైంకి...

పవన్ ఓజీ.. సరైన టైంకి సరైన పోస్టర్!

| దీంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు.

By - Tupaki Desk
Update: 2024-06-04 09:35 GMT

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు అయ్యాక.. ఇప్పుడు తొలి విజయం సాధించారు పవన్! పిఠాపురం నుంచి 50 వేలకు పైగా మెజారిటీతో గెలిచే దిశగా దూసుకెళ్తున్నారు. అంతే కాదు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా విజయం సాధించేలా ఉన్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. నెట్టింట ఎక్కడ చూసినా పవన్ కోసమే పోస్టులు కనిపిస్తున్నాయి.


అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా నుంచి సూపర్ అప్డేట్ వచ్చింది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలైంది. ఆ సమయంలో మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు. పోస్టర్లతో హోరెత్తించారు. ఆ తర్వాత పవన్ ఎన్నికల్లో బిజీగా మారడం వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రముఖ నగరాల్లో తీయాల్సిన షూటింగ్ పార్ట్ కాస్త ఎక్కువే పెండింగ్ ఉంది.

తాజాగా మేకర్స్.. ఓజీ నుంచి అదిరిపోయే పవన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎవ్వరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచేను రగిలే రివెంజ్ అంటూ రాసుకొచ్చారు. పోస్టర్ లో పవన్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా చైర్ లో కూర్చుని కనిపిస్తున్నారు. పోస్టర్ పై మేకర్స్.. ఓజీ టైమ్ బిగిన్స్ అంటూ రైటప్ ఇచ్చారు. ఇప్పుడు పవన్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పవన్ పోస్టర్ వేరే లెవల్ లో ఉందని కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు ఓజీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ కరెక్ట్ గా సెట్ అయ్యిందని నెటిజన్లతో పాటు పవన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి సరైన సమయంలో పోస్టర్ రిలీజ్ చేశారని అంటూ.. స్పెషల్ థ్యాంక్స్ కూడా చెబుతున్నారు. ఓజీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పెట్టిన పోస్ట్ కు లైకుల వర్షం కురిపిస్తున్నారు. రీ షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. పవన్ క్రేజ్ అంటే ఇలా ఉంటుందని ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు.

ముంబయి బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్, శ్రియా రెడ్డి, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, సీనియర్ నటుడు వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ విడుదల పోస్ట్ పోన్ అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • FilmIndustry 
  • Og 
  • NewPoster 
  • Pawankalyan 
  • PriyankaArulMohan 
  • SriyaReddy 
  • Sujeeth 
  • DvvDannayya 
  • Thaman 

Similar News

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

Copyright @2026

Powered by Blink CMS