• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్.. ఇది...

పవన్ కళ్యాణ్.. ఇది పర్ఫెక్ట్ డిసిషన్

| ఇదిలా ఉంటే తాజాగా జనసేన ఎంపీలు బాలసౌరి, ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. అదే సందర్భంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.

By - Tupaki Desk
Update: 2024-07-12 04:16 GMT

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పరిపాలనలో కీలక భూమిక పోషిస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకు రావడంలో పవన్ కళ్యాణ్ మెయిన్ పిల్లర్ గా నిలబడ్డారని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్న మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి స్వీకరించడంతో పాటు ఐదు మంత్రిత్వ శాఖల బాధ్యతలను టేకప్ చేశారు.

ఇప్పుడు వాటికి సంబంధించిన కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. రానున్న మూడు నెలలు కూడా తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పరిపాలన, పనితీరుపైన పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫోకస్ చేయబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు జనసేన నాయకులకు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన నాయకులు, కార్యకర్తలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా జనసేన ఎంపీలు బాలసౌరి, ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ ని కలిశారు. అదే సందర్భంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన ఎంపీలు పవన్ కళ్యాణ్ కి పుష్పగుచ్చానికి బదులు వెజిటేబుల్ బాక్స్ ని కానుకగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిని స్వీకరించారు. అదే సమయంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి ఒక మంచి సందేశాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు.

తనని కలవడానికి వచ్చే వారు ఎవరైనా శాలువాలు, విగ్రహాలు తీసుకురావద్దని సూచించారు. అలాగే పుష్పగుచ్చలు కూడా తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. వీటి స్థానంలో అన్నా క్యాంటీన్లకు డొనేషన్ రూపంలో టోకెన్స్ ఇవ్వగలిగితే సంతోషిస్తానని తెలియజేశారు. అలాగే ఇలాంటి వెజిటేబుల్ బాక్సులు ఇస్తే అవి అనాధాశ్రమాలకు పంపించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని ఇకపై తనని కలిసేందుకు వచ్చే ఎవరైనా తన సూచనల్ని పరిగణంలోకి తీసుకోవాలని కోరారు. ఉపయోగపడే వాటిని తీసుకొస్తే ఎవరో ఒకరికి ఇవ్వడానికి బాగుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి సంబందించిన వీడియోని జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాను రెగ్యులర్ రాజకీయ నాయకుడు కాదని మరోసారి రుజువు చేసుకున్నారని అభిమానులు ప్రశంసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఇనీషియేటివ్ మిగిలిన పొలిటికల్ లీడర్స్ కూడా ఫాలో అయితే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Pawankalyan 
  • Janasenaparty 
  • Vegetablebox 
  • Bouquet 
  • Mps 
  • Deputychiefminister 
  • Balasauri 
  • Udaysrinivaspawan 

Similar News

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS