వారంలో పవర్ స్టార్ తో పని పూర్తి..అంతలోనే ఇలా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. పవన్ కేటాయించిన డేట్ల వరకూ హరీష్ ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసారు. ఇంకా పీకే పై మరికొన్ని సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు పవన్ సరిగ్గా వారం రోజులు కేటాయిస్తే సరిపోతుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. చిత్రీకరణకు పవన్ కూడా సిద్దంగా ఉన్నారు. ఏపీలో రాజకీయ వాతావరణం ఎలా ఉన్నా? పీకే కూడా రెడీ ఫర్ షూట్ అన్నట్లే ఉన్నారు.
హీరోలంతా ఇళ్లకే పరిమితం:
కానీ ఒక్కసారిగా కార్మికులు సమ్మె సైరన్ మ్రోగించడంతో ఎక్కడి షూటింగ్ అక్కడే నిలిచిపోయింది. తొలుత బంద్ ప్రకటించినా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మాత్రం ఆగలేదని ప్రచారం సాగింది. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికుల్ని తీసుకొచ్చి షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. కొంత మంది కార్మి కులు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆ సినిమా షూట్ కూడా నిలిచి పోయినట్లు ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం అన్ని సినిమా షూటింగ్ లకు తాత్కాలికంగా పుల్ స్టాప్ పడింది. దీంతో హీరోలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
నెల రోజుల్లో పూర్తి:
ఈ సమయంలో విదేశీ షెడ్యూల్స్ కి అవకాశం ఉంటుందా? అన్న సందేహం ఉంది. తక్కువ మందితో ప్లైట్ లో వెళ్లి విదేశాల్లో షూటింగ్ చేసుకునే వెసులు బాటు ఉంది. మరి `ఉస్తాద్ భగత్ సింగ్` కి సంబం ధించి విదేశీ షెడ్యూల్స్ ఏవైనా ఉన్నాయా? అన్నది తెలియాలి. ఈ సందర్భంగానే మరో విషయం కూడా తెరపైకి వచ్చింది. `ఉస్తాద్ భగత్ సింగ్` బ్యాలెన్స్ షూటింగ్ కి నెల రోజులు సమయం సరిపోతుందని తెలిసింది. పవన్ పై వారం రోజుల షూటింగ్...ఇతర నటీనటులపై మరో పాతిక రోజుల చిత్రీకరణ మాత్ర మే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో టాకీ పూర్తవుతుంది. అనంతరం పాటల చిత్రీకరణ మొదల వుతుంది.
పవన్ ని మళ్లీ కొత్తగా డేట్లు ఇవ్వాలి:
అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' నిలిచిపోవడం అన్నది పవన్ కు ఆటంకం. అతి కష్టం మీద పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు డేట్లు ఇస్తున్నారు. `హరిహరి వీరమల్లు` షూటింగ్ పూర్తవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలిసిందే? అటుపై మొదలైన `ఓజీ` చిత్రీకరణ పూర్తవ్వడానికి చాలా సమయం పట్టింది. ఈ రెండింటి కంటే? `ఉస్తాద్ భగత్` సింగే వేగంగా పూర్తవుతుందనుకుంటే బంద్ ఆటంకంగా మారింది. దీంతో పవన్ మళ్లీ బంద్ అనంతరం కొత్త డేట్లు కేటాయించాల్సి ఉంటుంది.