అన్ హెల్తీ పవన్.. రీజన్స్ ఏంటి..?

అలా ఇచ్చిన టైం లోనే రెండు నెలల క్రితం హరి హర వీరమల్లు పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఇక ఓజీని కూడా ఫినిష్ చేసి రిలీజ్ చేశారు. ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ మూవీగా సుజిత్ అందించాడు.;

Update: 2025-09-28 07:41 GMT

మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో మాత్రమే కానీ ఇప్పుడు ఆయన ఒక స్టేట్ డిప్యూటీ సీఎం. సినిమాలకు ఎంత టైం తీసుకున్నా పర్లేదు కానీ ఆయన జననేతగా ప్రజా పాలనలో అసలు ఆలస్యం చేయకూడదు. అందుకే అటు పాలిటిక్స్, ఇటు సినిమాలు రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కమిటైన సినిమాలు పూర్తి చేయాలన్న ఆలోచనతోనే ఆయన కొద్దిరోజులు టైం ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు, OG..

అలా ఇచ్చిన టైం లోనే రెండు నెలల క్రితం హరి హర వీరమల్లు పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఇక ఓజీని కూడా ఫినిష్ చేసి రిలీజ్ చేశారు. ఓజీ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ మూవీగా సుజిత్ అందించాడు. ఆ సినిమా విషయంలో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ. ఐతే ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వర్షం లో తడిచారు. అప్పటి నుంచి ఆయనకు వైరల్ ఫివర్ ఎటాక్ అయ్యింది. అందుకే సినిమా రిలీజ్ ముందు ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు.

పవన్ కళ్యాణ్ తరచు ఫీవర్ భారిన పడటం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. మొన్నామధ్య కూడా పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ అని వార్తలు వచ్చాయి. ఐతే పవన్ కళ్యాణ్ ఈ అన్ హెల్తీకి రీజన్ ఆయన రోజులో దాదాపు 18 గంటల పాటు పనిచేయడమే అని తెలుస్తుంది. సినిమాలు, రాజకీయాలు రెండిటి కోసం తనకున్న 24 గంటల టైం లో 18 గంటలు కేటాయిస్తున్నారట. అందుకే విశ్రాంతి లేకపోవడం వల్ల ఇలా తరచు ఫీవర్ భారిన పడుతున్నారని అంటున్నారు.

రాజకీయాల్లో తన మార్క్..

ముందు ప్రజల శ్రేయస్సు ఆ తర్వాత సినిమాలు ఇలా తన డే ని మొత్తం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఓజీ పూర్తి చేసి రిలీజ్ చేశారు.. ప్రెజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ మీద ఉంది. ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తే కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నారట పవన్ కళ్యాణ్.

రాజకీయాల్లో తన మార్క్ చూపించాలంటే ఇలా సినిమాలు, పాలిటిక్స్ రెండు చేయడం కుదరదని ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ మూవీ అయ్యాక సినిమాలు తర్వాత ముందు పాలిటిక్స్ లో పూర్తిస్థాయి టైం కేటాయిస్తారట. పవన్ ఇలా కష్టపడటం అటు ప్రజలకు ఇటు ఫ్యాన్స్ కి హ్యాపీగానే ఉన్నా ఏం చేస్తున్నా ఎంత చేస్తున్నా హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.

Tags:    

Similar News