పవన్ OG.. రేట్లతో రిస్క్ చేస్తారా?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాతో మరికొద్ది రోజుల్లో సందడి చేయనున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన థియేటర్స్ లోకి రానున్నారు.
అయితే ఓజీ మూవీపై ఆడియన్స్ లో వేరే లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే ఆడియన్స్, ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత అప్డేట్స్ తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా పవన్ లైనప్ లోని సినిమాల్లో ఓజీకి ఉన్నంత క్రేజ్ ఇంకో మూవీకి కూడా క్రియేట్ అవ్వలేదు.
దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూవీకి ఆకాశమంత క్రేజ్ ఉండడంతో మేకర్స్.. రైట్స్ ను భారీ ధరలకు కోట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా కృష్ణ ఏరియా హక్కులు రూ.10 కోట్లు పలికారని టాక్ వచ్చింది.
అయితే ఇప్పుడు మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.150 కోట్లకు పైగా ఆర్జిస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్ర హక్కులను రూ.80 కోట్లు, సీడెడ్ రైట్స్ ను రూ.23 కోట్లకు కోట్ చేసినట్లు సమాచారం. నైజాం థియేట్రికల్ హక్కులు రూ.50 కోట్లుగా చెబుతున్నారని టాక్.
అదే సమయంలో ఆంధ్ర, సీడెడ్ లో టికెట్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది. కానీ నైజాంలో రేట్లు పెంపు విషయంపై క్లారిటీ లేదు. కాబట్టి అక్కడ అదనపు రేట్లకు అనుమతులు దొరకపోతే నైజాం రేట్లు తగ్గొచ్చు. అయితే ఇప్పుడు థియేట్రికల్ రేట్స్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు తెగ రెస్పాండ్ అవుతున్నారు.
అయితే సినిమాకు క్రేజ్ ఉన్న విషయం నిజమే గానీ.. మరీ ఎక్కువ ధరకు మేకర్స్ కోట్ చేస్తున్నట్లు అనిపిస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని అందుకే అంత ధర పలుకుతుందని చెబుతున్నారు. ఏదేమైనా మేకర్స్ రిస్క్ చేస్తున్నారని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.