OG థియేట్రికల్ రైట్స్ ఫుల్ క్లియర్: మళ్లీ హై లెవెల్లో పవన్ మార్కెట్!
ప్రస్తుతం OG షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఫ్యాన్స్ ఎక్కువగా ఫోకస్ చేస్తోంది ఓజీ (OG) సినిమా కోసమే. 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, పవన్ గత చిత్రాల కన్నా స్టైలిష్‌గా, ఇంటెన్స్‌గా ఉండబోతుందన్న అభిప్రాయం ట్రెండ్‌గా మారుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, లుక్స్, మ్యూజిక్ క్లిప్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.
ప్రస్తుతం OG షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, తన మార్క్ మ్యూజిక్‌తో తమన్ మరోసారి సినిమాను లెవలప్ చేయనున్నాడు. మాస్, స్టైల్, ఎమోషన్ మిక్స్‌తో OG ఈ ఏడాది పవన్ కెరీర్‌కు స్పెషల్ సినిమా అవుతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. మేకర్స్ దాదాపు అన్ని ఏరియాల్లో డీల్స్ క్లోజ్ చేసినట్టు సమాచారం. పవన్ గత సినిమాలతో పోలిస్తే OG సినిమాకు భారీ రేట్లతో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఆంధ్ర ప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కలిపి రూ. 81 కోట్ల రేషియోలో అమ్మకాలు జరిపినట్టు తెలుస్తోంది.
నైజాం - ఉత్తరాంధ్ర రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ మొత్తానికి తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ఏరియా డీల్స్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ చేతికి వెళ్లాయని సమాచారం. ఇక తూర్పు, పశ్చిమ గోదావరి రైట్స్‌ను జనసేన ఎంపీ, టీ టైమ్ ఉదయ్ పొందారని టాక్. కృష్ణ జిల్లాను ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ధీరజ్ మొగిలినేని కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లా జెపిఆర్ ఫిలిమ్స్‌కు తక్కువ టైమ్‌లో ఓకే చేసినట్టు సమాచారం.
ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే, రూ.12 కోట్లు ప్లస్ జీఎస్టీతో OG సినిమాను జెపిఆర్ ఫిలిమ్స్ హోల్సేల్‌గా దక్కించుకుందట. ఈ డీల్‌తో OG పై ఉన్న మార్కెట్ క్రేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ మార్కెట్లలో కూడా డీల్ క్లోజ్ కాబోతున్నదని సమాచారం. ఫస్ట్ లుక్ నుంచి బిజినెస్ వరకూ OG సినిమా పవన్ మార్కెట్‌ను మరోసారి హై లెవెల్లోనో తీసుకెళ్లిందనే చెప్పాలి. ఇన్ని అంచనాల నడుమ OG థియేట్రికల్ రిలీజ్ తేదీపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.