OG జస్ట్ 4 డేస్ అంతే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు.;

Update: 2025-08-24 07:53 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన సుజిత్ ఆయన్ను తన ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో అలాంటి సినిమాగా ఓజీ చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా మేకింగ్ పరంగా టాప్ క్లాస్ అనేలా ఉంటుందట. గ్యాంగ్ స్టర్ కథతో వస్తున్న ఓజీ సినిమా షూటింగ్ మరో 4 రోజులు మాత్రమే మిగిలి ఉందట. అది కూడా కొన్ని ప్యాచ్ వర్క్ మాత్రమే అని టాక్.

ఓజీ ప్యాచ్ వర్క్..

సినిమాకు సంబందించిన 2 డేస్ కాకినాడలో షూటింగ్.. మరో రెండు రోజులు హైదరాబాద్ లో ప్యాచ్ వర్క్ చేస్తే గుమ్మడికాయ కొట్టేయడమే అని తెలుస్తుంది. సినిమా రిలీజ్ ఇంకా నెల్ రోజులు మాత్రమే ఉన్న ఈ టైం లో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టబోతున్నారు మేకర్స్. ఆగష్టు 27 వినాయక చవితి సందర్భంగా సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. అది కూడా అదిరిపోతుందని అంటున్నారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఓజీ సినిమా మ్యూజిక్ పరంగా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందట. సినిమా లో పవర్ స్టార్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. ఇప్పటికే పవర్ స్టోర్మ్ సాంగ్ తో సినిమాపై హ్యూజ్ బజ్ పెంచాడు సుజిత్. ఇక నెక్స్ట్ సినిమాను ఫ్యాన్స్ అంచనాలకు మించి ఉండేలా చేస్తున్నాడట.

తాను ఎంత గొప్ప పవర్ స్టార్ ఫ్యాన్..

ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని తెలుస్తుంది. ఓజీ సినిమా షూటింగ్ పూర్తైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా త్వరగా పూర్తి చేసేలా సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. తప్పకుండా సుజిత్ ఈ సినిమాతో తాను ఎంత గొప్ప పవర్ స్టార్ ఫ్యాన్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రీసెంట్ గా హరి హర వీరమల్లు సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత వస్తున్న ఓజీపై అంచనాలైతే త్రాస్థాయిలో ఉన్నాయి. మరి ఈ అంచనాలను అనుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జతగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. తెలుగులో ఆమెకు ఇది నాలుగో సినిమా. సరిపోదా శనివారం తో హిట్ కొట్టిన అమ్మడు ఓజీ తో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News