OG ఓపెనింగ్స్ కు దెబ్బెసేలా ఉన్నారు?
ఈ క్రమంలోనే మేకర్స్ ఇంకా ఓవర్సీస్ మల్టిప్లెక్స్ లకు కంటెంట్ పంపలేదు. దీంతో అమెరికా, కెనడా వ్యాప్తంగా అనేక థియేటర్లు షోలను క్యాన్సిల్ చేస్తున్నాయి.;
తెలుగు మోస్ట్ అవెయిటెడ్ సినిమా ఓజీ రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్ సేల్స్ తో అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. అమెరికా, కెనడాలో ఒక నెల ముందే ఓజీ బుకింగ్స్ ప్రారంభం కాగా.. ఇప్పటికే 2.25 మిలియన్ డాలర్ల మార్క్ కూడా అందుకుంది. దీంతో ఓపెనింగ్ డే, ఓవర్సీస్ లో భారీ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలతో పాటు మేకర్స్ కూడా ధీమాగా ఉన్నారు.
కానీ, అసలు పరీక్ష ముందుంది. కంటెంట్ లేట్ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధించడం అంత ఈజీగా కనిపించడం లేదు. మేకర్స్ ఇంకా.. ఓవర్సీస్ మల్టీపెక్స్ చైన్ థియేటర్లకు కంటెంట్ పంపలేదు. ఓవర్సీస్ మల్టీప్లెక్స్ చైన్స్ లో రూల్స్ కఠినంగా ఉంటాయి. మేకర్స్ కంటెంట్ ను ఆన్ టైమ్ లోనే ఇచ్చేయాల్సి ఉంటుంది. లేదంటే రూల్స్ ప్రకారమే షోలను క్యాన్సిల్ చేసే అధికారం వాళ్లకు ఉంది.
ఈ క్రమంలోనే మేకర్స్ ఇంకా ఓవర్సీస్ మల్టిప్లెక్స్ లకు కంటెంట్ పంపలేదు. దీంతో అమెరికా, కెనడా వ్యాప్తంగా అనేక థియేటర్లు షోలను క్యాన్సిల్ చేస్తున్నాయి. కంటెంట్ పంపడంలో ఆలస్యం చేయడం వల్ల ఇప్పటికే పలు ఏరియాల్లో షోలు రద్దు కూడా చేసేశారు. ఇది సినిమా ఓపెనింగ్ నెంబర్లపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది.
అయితే మేకర్స్ ఈ సినిమా ప్రతి విషయంలో డిలే చేస్తున్నారు. రెండు రోజుల్లో రిలీజ్ పెట్టుకొని ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ చేశారు. మరోవైపు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సైతం ఈ ఆలస్యం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఇంత డిలే చేస్తున్నారో అర్థం అవ్వడం లేదంటూ ప్రొడక్షన్ కంపెనీ, డైరెక్టర్ సుజిత్ ను ట్రోల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. ఒకరోజు ముందు 24న రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి.
ముంబయి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ హష్మి విలన్ గా ఓమీ పాత్ర చేశారు. ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.