వీరమల్లుకు జరిగినట్లు 'ఓజీ' కి సాధ్యం కాదా?
`హరిహర వీరమల్లు` సినిమా సినిమా రిలీజ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్లో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో తెలిసిందే.;
`హరిహర వీరమల్లు` సినిమా సినిమా రిలీజ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్లో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో తెలిసిందే. యూనిట్ నిర్వహించిన ఏ ప్రచార వేదినకను పవన్ మిస్ అవ్వలేదు. ఎంతో విధిగా ఆసినిమాను తానే దగ్గరుండి ప్రచారం చేసారు. అంత వరకూ పవన్ ఉన్న బిజీ షెడ్యూ ల్ లో కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తప్ప ఇంకే ప్రచార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని మీడియాలో పెద్ద ఎత్తున కథనాలొచ్చాయి.
ఫలించని ప్రయత్నమది:
వాటిని బ్రేక్ చేస్తూ పవన్ ను వీరమల్లును ప్రచారం చేయడంతో ఇదంతా నిజమేనా? అని సందేహం సైతం వ్యక్తమైంది. ఎందుకంటే గతంలో ఆయన ఏ సినిమా ప్రచారంలో పాల్గొన లేదు. కేవలం సినిమా రిలీజ్ ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించడం తప్పితే ఇంకే ఈవెంట్లో పాల్గొనే వారు కాదు. అలాంటి వ్యక్తి వీరమల్లు ప్రచారంలో ఎక్కడ చూసినా ఆయనే కనిపించడంతో అంతా షాక్ అయ్యారు అలా ఎంత ప్రచారం చేసినా సినిమా ఫలితం మాత్రం కలిసి రాలేదు. ప్రచారంలో పవన్ పెట్టిన ఎఫెర్ట్ అంతా వృద్ధా ప్రయత్నంగానే మిగిలిపోయింది. ఇదంతా గతం.
వీరమల్లు తరహాలో ప్రచారం:
సెప్టెంబర్ 25న భారీ అంచనాల మధ్య పవన్ నటించిన మరో చిత్రం `ఓజీ` రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అంతకంతకు హైప్ పెంచేసాయి. అన్న ఈ సినిమా ఫలితంతో అన్ని లెక్కలు సరిచేస్తాడని అభిమానులు, జనసైనుకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో అన్న ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశీస్తున్నారు. మరి ఇన్ని అంచనాలున్న సినిమాను పవన్ వీరమల్లు తరహాలో ప్రచారం చేస్తారా? అంటే లేదనే మాట ఇండస్ట్రీ నుంచి గట్టిగానే వినిపిస్తోంది.
మళ్లీ మిరాకిల్ జరుగుతుందా:
రిలీజ్ కు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. త్వరలోనే సినిమా ప్రచారం పనులు మొదల వుతాయి. దీనిలో భాగంగా రకరకాల ఈవెంట్లు ప్లాన్ చేస్తోంది. కానీ వాటి వేటిలోనూ పీకే పాల్గొనరని వార్త లొస్తున్నాయి. కేవలం విశాఖలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రమే పాల్గొంటారని చిత్ర వర్గాల నుంచి వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ పొలిటికల్ షెడ్యూల్ చాలా బిజీగా ఉందని..ఆ కారణంగా ఓజీ ప్రచారానికి పరిమితంగానే హాజరవుతారని అంటున్నారు. మరి చివరి నిమిషంలో ఏదైనా మిరికాల్ జరిగితే చెప్పలేం.