OG డే 1 కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో పవన్ పవర్ ఇలా ఉంది!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడూ కూడా ఓ సంబరమే. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ లో జోష్ మాములుగా ఉండదు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడూ కూడా ఓ సంబరమే. పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ లో జోష్ మాములుగా ఉండదు. ఈసారి సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఓజీ కూడా అదే హంగామాతో థియేటర్లకు వచ్చింది. సినిమా విడుదలైన నిమిషం నుంచే థియేటర్ల ముందు ఫెస్ట్ లాంటి వాతావరణం నెలకొంది. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ కేరింతలు, కేకలు హాళ్లను హోరెత్తించాయి. ఓవరాల్ టాక్ మిక్స్ డ్ గా ఉన్నప్పటికీ పవన్ ఎంట్రీ, తమన్ మ్యూజిక్ తో ప్రతి షాట్‌కి ఎలివేషన్ రావడంతో ఫ్యాన్స్ పూనకాలు తెచ్చుకున్నారు.
ఇక ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయి వసూళ్లు సాధించింది. పాజిటివ్, మిక్స్ టాక్ ఉన్నప్పటికీ పవన్ స్టైల్, యాక్షన్ సీన్స్ అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దసరా సెలవులు కూడా కలిసొచ్చి, శుక్రవారం, శనివారం, ఆదివారం వరుసగా హాలిడే ఎఫెక్ట్ ఉండటంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొదటి రోజు బలమైన ఓపెనింగ్ రావడంతో ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ సినిమా రన్ గురించి మరింత పాజిటివ్ గా మాట్లాడుతున్నాయి.
నైజాం, సీడెడ్ లాంటి ఏరియాల్లో పవన్ పవర్ మళ్లీ బలంగా కనిపించింది. టికెట్ రేట్ల సమస్యలు, షోలు సస్పెన్స్ మధ్య కూడా ఇంత భారీ వసూళ్లు రావడం సినిమా మీద ఉన్న క్రేజ్ కి నిదర్శనం. ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పుడు, మొదటి రోజు కలెక్షన్లే కాకుండా రాబోయే రోజులలో కూడా సినిమా బలంగా రన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. దసరా సీజన్ ఎఫెక్ట్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు మరింతగా పెరగవచ్చని వారు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్స్ (అంచనా)
నైజాం: 24.42 కోట్లు
సీడెడ్: 7.50 కోట్లు
ఉత్తరాంధ్ర: 6.70 కోట్లు
ఈస్ట్: 5.30 కోట్లు
వెస్ట్: 5.15 కోట్లు
గుంటూరు: 6.35 కోట్లు
కృష్ణా: 4.80 కోట్లు
నెల్లూరు: 2.13 కోట్లు
మొత్తం ఏపీ, తెలంగాణ: 62.35 కోట్లు
మొత్తం మీద ఓజీ స్టార్ట్ పవర్ ఫుల్ గానే హైలెట్ అయ్యింది. సినిమా మొదటి రోజు రికార్డు స్థాయిలో దూసుకెళ్లింది. ఇప్పుడు వీకెండ్ సెలవులు కలిసొచ్చి వసూళ్లు ఇంకా పెరుగుతాయనే నమ్మకం ఉంది. టాక్ మిక్స్ డ్ గా ఉన్నప్పటికీ పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలం అయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా లాంగ్ రన్ కూడా బాగానే ఉంటుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.