పవన్ OG.. అసలు ఫ్యానిజం అంటే ఇదేనేమో!

ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ పడనున్నాయి. చాలా రోజుల క్రితమే బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా ఓ రేంజ్ లో జరిగాయి.;

Update: 2025-09-24 09:46 GMT

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ మరికొన్ని గంటల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కానుండగా.. సెప్టెంబర్ 24న అంటే నేడే రాత్రి ప్రీమియర్స్ పడనున్నాయి.


ఓవర్సీస్ లో కూడా ప్రీమియర్స్ పడనున్నాయి. చాలా రోజుల క్రితమే బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా ఓ రేంజ్ లో జరిగాయి. అనేక రికార్డులు కూడా క్రియేట్ అయ్యాయి. అయితే ప్రీమియర్స్ కు సమయం కొన్ని గంటలే ఉన్నా.. నార్త్ అమెరికాలోని అనేక ప్రాంతాలకు హార్డ్ డ్రైవ్ లు చేరలేదని వార్తలు వచ్చాయి. దీంతో రిలీజ్ అనుకున్న టైమ్ కు కష్టమనేనని టాక్ వచ్చింది.


అయితే సమస్యను పరిష్కరించడానికి పవర్ స్టార్ అభిమానులు వెంటనే రంగంలోకి దిగారు. లాస్ ఏంజిల్స్ నుంచి అమెరికా అంతటా వివిధ థియేటర్లకు ఓజీ హార్డ్ డ్రైవ్‌ లను తరలించే బాధ్యతను తీసుకున్నారు. ఓవర్సీస్ మూవీ డిస్ట్రిబ్యూటర్ ప్రత్యంగిరా సినిమాస్ సమన్వయంతో.. ప్రీమియర్స్ సకాలంలో పడేలా చర్యలు తీసుకున్నారు.


వ్యక్తిగతంగా రాత్రంతా డ్రైవ్‌ లను తీసుకెళ్లి డెలివరీ చేశారు. అయితే అభిమానులంతా బాక్సులను హ్యాండిల్ చేయడం, థియేటర్లలో వాటిని అందజేయడం, విజయవంతమైన డెలివరీ చేయడం.. వీటికి సంబంధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు అనేక మంది స్పందిస్తున్నారు.


పవర్ స్టార్ అభిమానులు చూపిన చొరవను అభినందిస్తున్నారు. ఇదే కదా అసలైన ఫ్యానిజం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ ఫ్యాన్స్ తీసుకున్న చర్యలు.. ఓజీ కల్ట్ ఫాలోయింగ్‌ ను చాటి చెప్పిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పట్ల అభిమానులు తమ అంకిత భావాన్ని హైలైట్ అయ్యేలా చేశారని అంటున్నారు.

హార్డ్ డ్రైవ్ వల్ల స్క్రీనింగ్ ఆలస్యం అవ్వకుండా.. అభిమానులకు, ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి కొరియర్ బాయ్స్ గా మారి ఎంతో సహకరించారు కొందరు అభిమానులు. దీంతో అనేక మంది ఫ్యాన్స్.. వారికి థ్యాంక్స్ చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ హార్డ్ డిస్క్ లు అందాయని సోషల్ మీడియాలో చెప్పారు. దీంతో అమెరికా అంతటా ప్రీమియర్‌ లు అనుకున్నట్లే పడనున్నాయి.

Tags:    

Similar News