డే1 రికార్డుల‌పై క‌న్నేసిన ఓజి ఫ్యాన్స్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఓజి సినిమా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచ‌నాలున్నాయి.;

Update: 2025-09-21 17:09 GMT

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఓజి సినిమా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచ‌నాలున్నాయి. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ అంచ‌నాలు తారా స్థాయికి పెరిగిపోతున్నాయి. వాస్త‌వానికి ఓజి సినిమాకు మేక‌ర్స్ పెద్ద‌గా ప్ర‌మోష‌న్స్ కూడా చేయ‌డం లేదు.

కానీ ఓజిపై రోజురోజుకీ అంచ‌నాలు భారీగా పెరుగుతున్నాయి. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ప‌వ‌న్ నుంచి చాలా కాలం త‌ర్వాత వ‌స్తున్న ప్రాప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా కావ‌డంతో పాటూ ఈ సినిమాకు ప‌వ‌న్ వీరాభిమాని అయిన సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఓజి సినిమాకు సుజిత్ మొద‌టినుంచి త‌న బెస్ట్ ఇస్తూనే వ‌చ్చారు. పైగా ఈ సినిమాను ఎంతో స్టైలిష్ గా తెర‌కెక్కించారు సుజిత్ .

ఓజిపై ఆశ‌లు పెట్టుకున్న ప‌వ‌న్ ఫ్యాన్స్

త‌మకు ఫుల్ మీల్స్ పెట్టే సినిమా ప‌వ‌న్ నుంచి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ చేస్తున్న వెయిటింగ్ కు ఓజి ఫుల్ స్టాప్ పెడుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీ రికార్డులు అందుకున్న ప‌వ‌న్, తిరిగి ఓజి సినిమాతో రికార్డుల‌ను క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. ప‌వ‌న్ పాలిటిక్స్ లోకి వెళ్ల‌క‌ముందు అత‌ను చేసిన సినిమాల‌కు స‌ప‌రేట్ క్రేజ్ ఉండేది.

పాలిటిక్స్ లోకి వెళ్లాక సినిమాల‌పై త‌గ్గిన ఫోక‌స్

కానీ ప‌వ‌న్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వెళ్లారో అప్పుడే సినిమాల‌పై ఫోక‌స్ త‌గ్గించి ఎక్కువ‌గా రీమేక్ ల‌పై దృష్టి పెట్టారు. ఈ నేప‌థ్యంలో అత‌న్నుంచి వ‌కీల్ సాబ్, భీమ్లా నాయ‌క్ లాంటి సినిమాలొచ్చాయి. ఆ సినిమాలు మంచి హిట్లుగా నిలిచిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ స్టామినా అది కాద‌నేది అంద‌రికీ తెలిసిన విష‌యమే. అందుకే ఇప్పుడొస్తున్న ఓజిపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి.

ఓజి హైప్ చూస్తుంటే ప‌వ‌న్ ఈసారి రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయంగానే అనిపిస్తోంది. ఇప్ప‌టికే కొన్ని ఏరియాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొద‌ల‌వ‌గా, స్టార్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే అవ‌న్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయంటే ఓజి హైప్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ప‌వ‌న్ డే1 రికార్డులు కొట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌నిపిస్తోంది. పోస్ట‌ర్లు, టీజ‌ర్, లిరిక‌ల్ సాంగ్స్ విష‌యంలో తీసుకున్న‌ట్టే సుజిత్ సినిమా విష‌యంలో కూడా శ్ర‌ద్ధ తీసుకుని ఉంటే మాత్రం ఓజి రికార్డుల‌ను ఆప‌డం ఎవ‌రి వల్లా కాదు. మ‌రి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆశ‌ల‌ను ఓజి తీరుస్తాడో లేదో చూడాలి.

Tags:    

Similar News