వీరమల్లు వర్సెస్ కింగ్ డమ్ క్లారిటీ ఎప్పుడంటే?
ఇలా ఒక్కసారి కాదు వీరమల్లు రిలీజ్ తేదీ ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రతీసారి ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహరవీరమల్లు' జూలై 24 న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో వాయిదాల తర్వాత జూలై 24వ తేదీకి ఫిక్సైంది. అయితే వీరమల్లు ఇలా వాయిదాలు వేసుకుంటూ ఎప్పటిప్పుడు కొత్త తేదీలు ప్రకటించడం వల్ల ఆ తేదీలకు ఫిక్సైన చిత్రాలు కొంత గందరగోళానికి గురయ్యాయి. పవన్ కళ్యాణ్ ని చూసి ఆ సినిమాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి.
ఇలా ఒక్కసారి కాదు వీరమల్లు రిలీజ్ తేదీ ఇచ్చి వెనక్కి తీసుకున్న ప్రతీసారి ఇలాంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా జూలై 25న విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'కింగ్ డమ్' చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ తేదీకి రావడం విజయ్ కి ఇష్టం లేదు. కానీ ఓటీటీ ఆ తేదీకి రిలీజ్ చేస్తేనే డీల్ కుదుర్చుకుంటామనే ఒప్పందం పైన ఉంది.
ఇప్పుడు సినిమాలన్నీ ఓటీటీ ఇచ్చిన స్లాట్ ప్రకారమే థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. కాదు కుదరదంటే డీల్ క్యాన్సిల్ చేస్తున్నాయి. అలా నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీరమల్లు -కింగ్ డమ్ ఒకేసారి రిలీజ్ అయితే నష్టాలు తప్పవు. అది కింగ్ డమ్ కి కావొచ్చు. వీరమల్లుకు కావొచ్చు. ఏ సినిమా బాగుంటే జనాలు ఆ సినిమాకే వెళ్తారు కాబట్టి ఓ సినిమా కిల్ అవుతుంది.
అదే పోటీ లేకుండా రిలీజ్ అయితే సినిమా పోయినా కొంత వరకూ నష్టాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. దీంతో చిత్ర నిర్మాత నాగవంశీ కింగ్ డమ్ ని జూలై 25 నుంచి ఆగస్టు 1 మార్చే లా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓటీటీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని వినిపిస్తుంది.