ప‌వ‌న్ కెరీర్ లో ఈ గ్యాప్ మ‌చ్చలా మిగ‌ల‌దుగా!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు ద‌శాబ్ధాలుగా చిత్ర పరిశ్ర‌మ‌లో హీరోగా కొన‌సాగుతున్నారు. కుదిరితే ఏడా దికి ఒక సినిమా రిలీజ్ చేసేవారు.;

Update: 2025-05-17 06:00 GMT

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు ద‌శాబ్ధాలుగా చిత్ర పరిశ్ర‌మ‌లో హీరోగా కొన‌సాగుతున్నారు. కుదిరితే ఏడా దికి ఒక సినిమా రిలీజ్ చేసేవారు. లేదంటే రెండేళ్ల‌కు ఒక్క సినిమా అయినా రిలీజ్ కు ఉండేలా చూసుకు నే వారు. మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో పప‌న్ చేసిన సినిమాల సంఖ్య చూస్తే 30 లోపే ఉంటుంది. అందులో కొన్ని ఆయ‌న గెస్ట్ అపిరియ‌న్స్ ఇచ్చిన‌వి తీసేస్తే సినిమాల సంఖ్య త‌గ్గిపోతుంది. అయితే ఏ సినిమా రిలీజ్ చేసినా రెండు...మూడేళ్లు మించ‌లేదు. కానీ `హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` మాత్రం ఏకంగా ఆరేళ్ల త‌ర్వాత రిలీజ్ అవుతున్న చిత్రం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది.

ఈ చిత్రం 2019 లో మొద‌లైంది. రిలీజ్ 2025 లో జ‌రుగు తుంది. `వ‌కీల్ సాబ్`, `భీమ్లా నాయ‌క్` కంటే ముందే వీర‌మ‌ల్లు మొద‌లైన పెద్ద ప్రాజెక్ట్ కావ‌డంతో రిలీజ్ సాధ్య‌ప‌డ‌లేదు. షూటింగ్ మొల్ల‌గా చేసు కుంటూ రావ‌డం ఓ కార‌ణ‌మైతే 2019 లో జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంతో? ప్ర‌భుత్వం తీరును ఎండ‌గ‌ట్టే ప‌నిలోబిజీ అయ్యారు. కాల‌క్ర‌మంలో రాజ‌కీయంగా మ‌రింత బిజీగా అయ్యారు. అటుపై చంద్ర‌బాబు నాయుడు తో క‌లిసి కూట‌మి ఏర్పాటు చేయ‌డం ..ప్రభుత్వం అధికారంలోకి రావ‌డం ఇలా....ఉప ముఖ్య‌మంత్రి కావ‌డంతో ప‌వ‌న్ మ‌రింత బిజీ అయ్యారు.

దీంతో వీర‌మ‌ల్లు స‌హా `ఓజీ` సినిమాల‌ను పూర్తిగా ప‌క్క‌న బెట్టిన‌ట్లు అయింది. షూటింగ్ కు హాజ‌ర‌య‌యే స‌మ‌యం ప‌వ‌న్ చేతుల్లో లేకుండా పోయింది. అలా చూస్తూ చూస్తూనే వీర‌మ‌ల్లుకు ఆరేళ్లు గ‌డిచిపోయాయి. దీంతో ఈసినిమాపై పెద్ద‌గా బ‌జ్ కూడా లేదు. రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో హైప్ అయినా క్రియేట్ అయిందా? అంటే అదీ లేదు. పాట‌ల ప‌రంగానూ వీక్ గానే క‌నిపిస్తుంది. జూన్ 12న రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో సినిమాకు ప్ర‌చారం త‌ప్ప‌నిస‌రి.

తూతూ మంత్రంగా కానిచ్చేస్తే రీచ్ అవ్వ‌డం క‌ష్టం. సాధ‌రణంగా డిలే చిత్రాల విష‌యంలో ఈ ర క‌మైన ప‌రిస్థితి స‌హ‌జ‌మే. కానీ అధిగ‌మించాలంటే ప్ర‌చారం పీక్స్ లో ఉండాలి. ప‌వ‌న్ ఇమేజ్ తో ఓపెనింగ్స్ కి ఇబ్బంది లేదు. కానీ ఆ త‌ర్వాత జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించా ల్సింది కంటెంట్ మాత్ర‌మే. అది తొలి రోజు మౌత్ టాక్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. టాక్ సాధార‌ణ ప్రేక్ష‌కుడి నుంచి రావాలి. ఒక‌వేళ ఫ‌లితం అటు ఇటు అయితే మాత్రం పీకే కెరీర్ లో ఇదో మ‌చ్చ‌గా మిగిలిపోతుంది అన్న‌ది అంతే వాస్త‌వం.

Tags:    

Similar News