వీరమల్లుతో బాక్సాఫీస్ బద్దలు కొట్టనున్న పవన్ కళ్యాణ్
మరోవైపు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవ్వాలని మెగా అభిమానులు కంకణం కట్టుకున్నారు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయల కారణంగా కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన హరిహర వీరమల్లు సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు. జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కెరీర్ లో తొలిసారిగా పవన్ పీరియాడికల్ పాత్రలో కనిపించనున్నందన ఈ మూవీకి ఫుల్ హైప్ వచ్చింది.
అయితే ఈ సినిమా రేపు విడుదల కానున్నందున ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి. ఓవర్సీస్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్ షోల పడనున్నాయి. పలు చోట్లు ఓపెనింగ్ డే టికెట్లు సోల్డ్ ఔట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఫుల్ హైప్ రావడం వల్ల టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మొహాల్లో నవ్వులు పూస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాకు భారీ ఓపెనింగ్ కలెక్షన్స్ ఇవ్వాలని మెగా అభిమానులు కంకణం కట్టుకున్నారు. అటు ఆయనే స్వయంగా ప్రమోషన్స్ లో దిగడంతో ఫుల్ బజ్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు వచ్చిన హైప్ లో పవర్ స్టార్ కెరీర్ లోనే ఇది అత్యధిక ఓపెనింగ్స్ సాధించేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాల పండితులు అంచనా వేస్తున్నారు. టికెట్ల అమ్మకాలలోనూ పవర్ స్టార్ క్రేజ్ కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఓపెనింగ్ రోజు వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో.
కాగా, ఐదేళ్ల ముందే ఈ సినిమా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను ప్రారంభించారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల ఆయన తప్పుకోగా, జ్యోతికృష్ణ టేకోవర్ చేశారు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా పూర్తయ్యింది. కోహినూర్ వజ్రం, భారతీయ సంస్కృతి ఇథి వృత్తంగా ఇది తెరకెక్కింది. ఇక గురువారం నుంచి థియేటర్లలో సందడి చేయనుంది.
ఏ ఎమ్ రత్నం ఈ సినిమా సమర్పించగా, ఏ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీరవాణి సంగీతం అందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్ ఔరంగజేబు పాత్రలో కనిపించను్నారు.