వీరమల్లుకేనా? ఓజీకి కూడా ఉంటుందా?
ఎందుకంటే గతంలో ఏ సినిమాకు ఆయన ఇలా ప్రమోట్ చేయలేదు. షూటింగ్... ఆ తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే కనిపించేవారు.;
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది దాదాపు మూడు దశాబ్దాల ప్రస్థానం. 30 ఏళల్లో ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినా ఆయన్నంటూ అభిమానించేది కోట్లాది మంది. అలా పవన్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని కలిగి ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే మీడియాతో ఆయన ఇంటరాక్షన్ ఉండేది. స్టార్ గా ఎదిగిన తర్వాత మాత్రం పవన్ మీడియాకు దూరంగానే ఉన్నారు. ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయినా రిలీజ్ కు ముందు ఆయన వ్యక్తిగత ఇంటర్వ్యూలు అనేవి లేకుండా పోయాయి.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో కనిపించడం తప్ప సినిమాకు సంబంధించి ఇంకెలాంటి ఈవెంట్లలో పవన్ కనిపించే వారు కాదు. కాల క్రమంలో పవన్ కనిపించడం అన్నది మరీ రేర్ గా మారిపోయింది. రాజకీ యాల్లోకి వచ్చిన తర్వాత...జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఎక్కువగా మీడియాలో కనిపిస్తున్నారు? తప్ప అంతకు ముందు కనిపించింది ఎన్నడు లేదు. ఆయన నటిస్తోన్న `హరిహర వీరమల్లు` చిత్రం రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఆ చిత్రాన్ని ఆయన మీడియాలో ప్రమోట్ చేస్తోన్న తీరు సర్వత్రా ఆసక్తికరం.
ఎందుకంటే గతంలో ఏ సినిమాకు ఆయన ఇలా ప్రమోట్ చేయలేదు. షూటింగ్... ఆ తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే కనిపించేవారు. కానీ వీరమల్లు ప్రచారం మాత్రం ఈ నాలుగు రోజులు ఆయన భుజ స్కందాలపై వేసుకుని మోస్తున్నట్లే కనిపిస్తుంది. మీడియాతో ఆయన మాట్లాడుతోన్న విధానం ఎంతో ముచ్చటేస్తుంది. ఎందుకిలా అంటే? తన కారణం సహా ప్రకృతి వైపరిత్యాల కారణంగా వీరమల్లు కు చాలా డ్యామేజ్ జరిగిందని అందుకే ముందుడి నాయకుడిలా నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సినిమా ఐదేళ్ల క్రితం మొదలైంది అన్న సంగతి తెలిసిందే. మరి ఈ ప్రచారం వీరమల్లుకే పరిమితమే సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే `ఓజీ`కి కూడా ఉంటుందా? అన్నది చూడాలి. `ఓజీ` కూడా పవన్ డిలే కార ణంగానే రిలీజ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల విషయంలో పవన్ పారితోషికం కూడా వెనక్కి తిరిగిచ్చినట్లు వార్తలొచ్చిన సంగతి విధితమే.