ప‌వ‌న్ మావ‌య్య‌తో బ‌న్ని మాటా మంతీ

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అగ్ర‌క‌థానాయ‌కుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు అల్లు నివాసానికి విచ్చేసారు.;

Update: 2025-08-31 18:49 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అగ్ర‌క‌థానాయ‌కుడు పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు అల్లు నివాసానికి విచ్చేసారు. అక్క‌డ అల్లు అర‌వింద్, అల్లు అర్జున్ ల‌ను ప‌రామ‌ర్శించారు. దివంగ‌త అల్లు రామ‌లింగ‌య్య స‌తీమ‌ణి, అర‌వింద్ త‌ల్లిగారైన‌ శ్రీ‌మ‌తి అల్లు క‌న‌క‌ర‌త్నం(94) మ‌ర‌ణం ఇటీవ‌ల అల్లు కుటుంబంలో విషాదం నింప‌గా, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ త‌దిత‌రులు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఆంధ్రప్ర‌దేశ్ లో ఓ ముఖ్య‌మైన స‌మావేశంలో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబు త‌దిత‌రులు అల్లు నివాసానికి ఆదివారం నాడు విచ్చేసారు.

అల్లు కుటుంబాన్ని క‌లిసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేసారు. అయితే శనివారం నాడు అల్లు కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు ప‌వ‌న్ భార్య అన్నా లెజ్నెవా అల్లు అరవింద్ ఇంటికి వచ్చిన సంగ‌తి తెలిసిందే.

వయస్సు సంబంధిత స‌మ‌స్య‌ల‌ కారణంగా శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు కనకరత్నం మరణించారు. ఆ స‌మ‌యంలో ఔట్ డోర్ లొకేష‌న్ లో షూటింగుల‌తో బిజీగా ఉన్న అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్ త‌మ షూటింగుల‌ను ర‌ద్దు చేసుకుని హైద‌రాబాద్ కి వ‌చ్చారు. చ‌ర‌ణ్ నేరుగా అల్లు నివాసంలో బ‌న్నిని హ‌గ్ చేసుకుని ఎమోష‌న‌ల్ అయిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. చ‌ర‌ణ్‌ తన మామ అల్లు అరవింద్‌ను కూడా ఆలింగనం చేసుకుని తన అమ్మమ్మకు చివరి నివాళులు అర్పించారు.

చిరంజీవి ఇటీవల తన దివంగత అత్తగారి కళ్ళను దానం చేయాలనే కోరికను నెరవేర్చాలనే తన నిర్ణయం గురించి వెల్ల‌డించిన వీడియో వైర‌ల్ అయింది. దుఃఖం మధ్య ఆయన మానవీయ చర్యకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిసాయి.

Tags:    

Similar News