బిడ్డకు 'నీర్' అని పేరు పెట్టిన పరిణీతి
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా దంపతులు గత నెలలో మగబిడ్డను స్వాగతించిన సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా దంపతులు గత నెలలో మగబిడ్డను స్వాగతించిన సంగతి తెలిసిందే. ఒక నెల తర్వాత ఇప్పుడు బేబి బోయ్ పేరును ప్రకటించారు. కుమారుడికి -నీర్ అని పేరు పెట్టారు. పరిణీతి దంపతులు ఆ చిన్నారి పాదాలను ముద్దు పెట్టుకుంటున్న స్వీటెస్ట్ ఫోటోగ్రాఫ్‌ని షేర్ చేసి ఇలా రాశారు.
మా హృదయాలు శాశ్వతమైన శాంతిని పొందాయి. మేం బాబుకి `నీర్` అని పేరు పెట్టాము. స్వచ్ఛమైన, దైవిక, అపరిమితమైన అని అర్థం.. అని తెలిపారు. చాలా మంది వారసుడికి పేరు పెట్టినందున శుభాకాంక్షలు చెప్పారు. నీర్ వేగంగా ఎదిగేస్తూ బుడి బుడి అడుగులు వేసేప్పటికి పారీలో చాలా మార్పులు వచ్చేస్తాయి. పారీ తిరిగి నటనలో బిజీ అవుతుందని భావిస్తున్నారు.
ఆప్ నాయకుడు రాఘవ్ చద్దాతో పరిణీతి చోప్రా స్నేహం, ప్రేమాయణం గురించి తెలిసిందే. ఈ జోడీ పెళ్లయాక పరిణీతి చోప్రా నటనకు దూరంగానే ఉంది. పరిణీతి నెక్ట్స్ ఏంటి? అంటే... ఈ భామ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. కొత్తగా పెళ్లయింది గనుక పారీ తన భర్త కోసం విలువైన సమయాన్ని వెచ్చిస్తోంది. ఇంతలోనే ఈ బ్యూటీ తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ దర్శకనిర్మాతలతో మంతనాలు సాగిస్తోందని సమాచారం.
పరిణీతి చోప్రా ప్రస్థానం పరిశీలిస్తే... తను అనుకోకుండానే నటి అయ్యారు. ముందు పెట్టుబడి బ్యాంకింగ్ లో కెరీర్ ఎంచుకోవాలని అనుకున్నారు. కానీ వ్యాపారం,ఫైనాన్స్, ఎకనామిక్స్ లో మంచెష్టర్ బిజినెస్ స్కూల్ నుంచి ట్రిపుల్ హానర్స్ డిగ్రీ చేసిన తరువాత, 2009 లో ఆర్థిక మాంద్యం తరువాత భారతదేశానికి తిరిగి వచ్చేశారు. ఇక్కడకు వచ్చాకా యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేశారు. ఆ తరువాత అదే సంస్థకు నటిగా కొనసాగేందుకు ఒప్పందం చేసుకున్నారు పరిణీతి. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం, ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ పొందారు.
2012లో `ఇష్క్ జాదే` సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాక, విమర్శకుల నుండి ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాలో పారీ నటనకు జాతీయ ఫిలిం అవార్డు-స్పెషల్ మెన్షన్, ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి నామినేషన్లు లభించాయి. ఆ తరువాత శుద్ధ్ దేశీ రోమాన్స్ (2013), హసీతో ఫసీ (2014)వంటి సినిమాల్లోని నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఈ సినిమాల్లోని నటనతో ఆమెకు నటిగా మంచి గుర్తింపు లభించింది.