పాన్ ఇండియా మార్కెట్‌లో హీరోల లెక్కలు మారాయా? కామియో కంటే బ్రాండ్ బిల్డింగ్‌కే ప్రాధాన్యం!
నిర్మాతలు కూడా ఈ కాంబినేషన్స్ ద్వారా సోషల్ మీడియా హైప్, నార్త్- సౌత్ మార్కెట్ కనెక్టివిటీ, ఓవర్సీస్ బజ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కాస్టింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు.
బాలీవుడ్‌లో ఒకప్పుడు క్యామియో అంటే కేవలం ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చే అంశంగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్ విస్తరించిన తర్వాత స్పెషల్ అప్పియరెన్స్‌లు కూడా సినిమా బిజినెస్ స్ట్రాటజీలో భాగమయ్యాయి. స్టార్ హీరో ఒక సినిమాలో కొన్ని నిమిషాలు కనిపించినా, ఆ ఇంపాక్ట్ ట్రైలర్ వ్యూస్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు కనిపించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పఠాన్, టైగర్, వార్ వంటి భారీ సినిమాల తర్వాత క్యామియో కల్చర్‌కు కొత్త స్థాయి వచ్చింది. ఇప్పుడు కామియో అనేది కేవలం స్క్రీన్ టైమ్ గురించి కాకుండా, అదొక స్టార్ బ్రాండ్ మరో స్టార్ బ్రాండ్‌తో కలిసే మార్కెటింగ్ అవకాశంగా మారింది. నిర్మాతలు కూడా ఈ కాంబినేషన్స్ ద్వారా సోషల్ మీడియా హైప్, నార్త్- సౌత్ మార్కెట్ కనెక్టివిటీ, ఓవర్సీస్ బజ్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కాస్టింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక ప్రచారం కూడా ఆసక్తిని రేకెత్తించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కార్తీక్ ఆర్యన్‌కు క్యామియో ఆఫర్ వెళ్లిందని, అయితే ఆయన ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా, ఇప్పుడు హీరోలు క్యామియోలను కెరీర్ స్ట్రాటజీ యాంగిల్ లో కోణంలో చూస్తున్నారా? అనే ప్రశ్నను ఈ డిస్కషన్ ముందుకు తెచ్చింది.
పాన్ ఇండియా మార్కెట్‌లో ప్రతి సినిమా హీరో ఇమేజ్‌ను నిర్మించే ప్రాజెక్ట్‌గా మారింది. ఒక స్టార్ మరో హీరో సినిమాలో కనిపించడం ద్వారా వచ్చే ప్రయోజనాలతో పాటు, తన సింత బ్రాండ్ పొజిషనింగ్‌పై కూడా లెక్కలు వేసే పరిస్థితులున్నాయి. ముఖ్యంగా యంగ్ హీరోలు తమ కెరీర్ దశను బట్టి ప్రతి ప్రాజెక్ట్‌ను బ్రాండ్ బిల్డింగ్‌లో భాగంగా పరిశీలిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా క్యామియోలు ఇప్పుడు సినిమా రిలీజ్‌కు ముందే డిస్కషన్ ను క్రియేట్ చేస్తూ, భారీ హైప్ ను సృష్టించే మార్కెటింగ్ టూల్‌గా మారాయి. ఒక స్పెషల్ అప్పియరెన్స్ న్యూస్ బయటకొస్తే, ఫ్యాన్స్ లో ఆటోమేటిక్ గా క్యూరియాసిటీ పెరుగుతుంది. సోషల్ మీడియాలో డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయి. ఫలితంగా సినిమా రిలీజ్ కు ముందే ఫ్రీ పబ్లిసిటీ దక్కుతుంది. అందుకే క్యామియోలకు సంబంధించిన వార్తలు అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ కంటే వేగంగా వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి పాన్ ఇండియా యుగంలో హీరోల లెక్కలు మారాయి. క్యామియో చేయాలా వద్దా అనే డెసిషన్ కేవలం డేట్స్ లేదా క్యారెక్టర్ లిమిటేషన్స్ ఆధారంగా కాకుండా, లాంగ్ టైమ్ బ్రాండ్ వాల్యూ, మార్కెట్ పొజిషనింగ్, ఫ్యూచర్ ప్రాజెక్టుల వ్యూహంతో ముడిపడి ఉంది. ఇప్పుడు క్యామియో కూడా ఒక బిజినెస్ డెసిషనే కావడంతో ఒక స్పెషల్ అప్పియరెన్స్ చుట్టూ ఇంత డిస్కషన్ జరుగుతోంది.