డాల్ఫిన్ల స్వర్గంలో పాలకోవా బ్యూటీ
అందాల పాలక్ కి సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 48 లక్షల (4.8 మిలియన్ల)కు పైగా అనుచరులున్నారు.;
పాలక్ తివారీ పరిచయం అవసరం లేదు. `ఆదిపురుష్` ఫేం సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ చేస్తోందన్న పుకార్ల నడుమ పాలక్ దేశమంతా ఫేమస్. బుల్లితెర నటి శ్వేతా తివారీ నటవారసురాలిగాను సుపరిచితురాలు. పాలక్ తన బోయ్ ఫ్రెండ్ ఇబ్రహీంతో సెలబ్రేషన్స్ కారణంగా విమర్శల్ని కూడా ఎదుర్కొంటోంది. ఈ బ్యూటీ డేటింగుల కంటే, సినిమా కెరీర్ పై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
అందాల పాలక్ కి సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 48 లక్షల (4.8 మిలియన్ల)కు పైగా అనుచరులున్నారు. పాలక్ వరుస ఫోటోషూట్లు హీటెక్కిస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు మారిషస్ బీచ్ లలో చిలౌట్ చేసిన ఫోటోషూట్లను షేర్ చేసిన పాలక్ ఇప్పుడు ఆస్ట్రేలియాలోని ఎగ్జోటిక్ లొకేషన్లలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని అందమైన ఫోటోగ్రాఫ్స్ ని షేర్ చేసింది.
ఆస్ట్రేలియాలో ఫేమస్ రిసార్ట్స్ ప్రత్యేకత గురించి చెప్పింది పాలక్. అక్కడ సముద్రపు అంచులో డాల్ఫిన్స్ నేరుగా మనుషులతో స్నేహం చేస్తాయని కూడా వెల్లడించింది. అంతేకాదు.. పాలక్ ఒక చిన్న చేపపిల్లను డాల్ఫిన్ కి ప్రేమగా తినిపించింది. అది ఆ బుల్లి చేపపిల్లను గొంతులో వేసుకుని నీళ్లలోనే పాలక్ మోకాలిపై ఒక ముద్దు కూడా ఇచ్చి వెళ్లింది. ప్రస్తుతం ఈ ఎగ్జోటిక్ లొకేషన్ నుంచి ఫోటోషూట్ ని పాలక్ నేరుగా తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇదే ఫోటోషూట్ లో బీచ్ ఇసుకలోకి ఏటవాలుగా ఒరిగిపోయిన ఒక భారీ కొబ్బరి చెట్టు వద్ద పాలక్ బికినీ ఫోటోషూట్ గుబులు రేపుతోంది. ఇందులో ఫ్లోరల్ మోనోకినిలో పాలక్ అందచందాలు హీట్ పుట్టిస్తున్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... పాలక్ `రోమియో S3` అనే చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది. అంతకుముందు సల్మాన్ భాయ్ కిసీ కా భాయ్ కిసీకి జాన్ చిత్రంలో నటించింది. భూత్నీ అనే హారర్ చిత్రంలోను పాలక్ నటించింది. కానీ ఇవేవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇటీవల పాలక్ యువహీరో ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ చేయడంపై తన తండ్రి (శ్వేతా తివారీ మాజీ భర్త) స్పందిస్తూ, డేటింగ్ కంటే నటనపై దృష్టి సారించాలని సూచించారు.