దురాశ దుఃఖానికి చేటు.. ఓటీటీ దుకాణ్ బంద్
ఓటీటీలు క్రియేటివ్ కంటెంట్ ని అందించగలవు. చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కంటెంట్ అద్భుతంగా ఉంది.;
సినిమా రంగాన్ని నాశనం చేస్తున్న ఓటీటీలపై ఒక సెక్షన్ ఎప్పుడూ నిరుత్సాహంగానే ఉంటుంది. డిజిటల్ యుగంలో ఓటీటీల వెల్లువ థియేట్రికల్ రంగానికి పెను ముప్పుగా పరిణమించడం చాలా మందికి నచ్చడం లేదు. ఎగ్జిబిషన్ రంగంలో ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పలువురు స్టార్ హీరోలు, నిర్మాతలు ఓటీటీల రాకతో సాంప్రదాయ సినిమా వీక్షణ విధానం దారుణంగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటీటీలు క్రియేటివ్ కంటెంట్ ని అందించగలవు. చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కంటెంట్ అద్భుతంగా ఉంది. కానీ ఏం లాభం? తినడానికి ప్లేట్ లో అన్నీ కనిపిస్తాయ్ కానీ సుగర్ రోగం అడ్డుపడుతుంది! అన్నట్టు ఇప్పుడు ఓటీటీల్లో కూడా సినిమాలను కొనుక్కుని చూడాల్సి రావడం నీరసం పుట్టిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ కంటెంట్ కి భారత్ లో విశేష ఆదరణ ఉన్న నేపథ్యంలో ఈ ఓటీటీలో షోలు, సినిమాలు కొనుక్కుని చూడాల్సిన పరిస్థితి దాపరిస్తుంటే దానిని అస్సలు సహించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఆర్థికంగా జేబుకు పెద్ద కోత పెట్టడమనని భావిస్తున్నారు.
ఇటీవలి కాలంలో సరైన కంటెంట్ ని కూడా అమెజాన్ ప్రైమ్ పుల్ చేయడం లేదని విమర్శలొస్తున్నాయి. అన్ని మంచి సినిమాలు అద్దెకు ఉన్నాయి. అదనంగా డబ్బు చెల్లిస్తేనే నచ్చిన సినిమా చూడగలరు. సరసమైన ధరకు మంచి కంటెంట్‌ను అందించే ప్లాట్‌ఫామ్‌గా ప్రారంభమై ఇప్పుడు తీవ్ర దురాశతో ప్రజల జేబుల్ని ఖాళీ చేయించడం నిరాశపరుస్తోంది. అయితే ప్రైమ్ వీడియోస్ మాత్రమే కాదు.. ఇతర ఓటీటీలు కూడా ఇలాంటి చాలా స్కీములతో దోపిడీ పథకాల్ని రచిస్తున్నవే. మిర్జాపూర్, పాతాళ్ లోక్ లాంటి ఒరిజినల్ సిరీస్ లను ఆపేసి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఏం సాధించదలిచింది? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓటీటీలు దురాశకు, పేరాశకు పోతే భారతదేశం నుంచి సరైన రిటన్ గిఫ్ట్ లభిస్తుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.