ఈసారి ఏఐ సినిమాలకు కూడా ఆస్కార్
అయితే ఈ సారి ఆస్కార్ అవార్డుల ఎంపిక విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్టు అకాడమీ ప్రకటించింది.;
మూవీ వరల్డ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే ఏడాది అంటే 2026 మార్చి 15న ఈ కార్యక్రమం జరనుంది. అయితే ఈ సారి ఆస్కార్ అవార్డుల ఎంపిక విషయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్టు అకాడమీ ప్రకటించింది.
2026లో ఆస్కార్ కోసం పోటీ పడే సినిమాల లిస్ట్ వచ్చే ఏడాది జనవరి 22న అనౌన్స్ చేయనున్నట్టు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ వెల్లడించింది. అంతేకాదు, ఈసారి కొన్ని విభాగాల్లో ఓటింగ్ విధానంలో కూడా మార్పులు చేసినట్టు తెలిపింది. నామినేట్ అయిన ప్రతీ సినిమానీ అకాడమీ సభ్యులు తప్పకుండా చూడాల్సిందేనని స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల ఇంకా బెటర్ డెసిషన్స్ తీసుకునే అవకాశాలున్నట్టు అకాడమీ భావిస్తున్నట్టు పేర్కొంది.
ఈ ఇయర్ అచీవ్‌మెంట్ ఇన్ కాస్టింగ్ అనే కొత్త కేటగిరీని కూడా పరిచయం చేసినట్టు అకాడమీ ప్రకటించింది. ఈ విభాగంలో విన్నర్ ను సెలెక్ట్ చేసే ప్రక్రియ రెండు దశలుగా జరగనుందని, ఫైనల్ ఓటింగ్ కు ముందు కాస్టింగ్ డైరెక్టర్లపై కొన్ని రౌండ్ల పరీక్షలు నిర్వహించనున్నట్టు ఆస్కార్ తెలిపింది.
అయితే ఈసారి ఏఐ టెక్నాలజీతో తీసిన సినిమాలను కూడా ఆస్కార్ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటారని అకాడమీ వెల్లడించింది. అలా అని మామూలు సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఏ మాత్రం ఉండదని, మొదటి ప్రాధాన్యత మానవ మెదడుతో రూపొందించిన సినిమాలకే అని, మానవ మేధస్సుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తామని అకాడమీ స్పష్టం చేసింది.
ఈ 98వ ఆస్కార్ అవార్డ్స్ వేడుక లాజ్ ఏజింల్స్ లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరగనుందని, ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య రిలీజైన సినిమాలకు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హత ఉంటుందని, మ్యూజిక్ విభాగంలో మాత్రం ఆఖరి తేదీని 2025 అక్టోబర్ 15గా అకాడమీ డిసైడ్ చేసింది. 2027 నుంచి స్టంట్ డిజైన్ విభాగంలో కూడా అవార్డలు అందించనున్నట్టు అకాడమీ తెలిపింది.