ఓర్రీ మేల్ ఊర్ఫీలా ఏంటా ఫోజులు?
అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి, అత్యంత ఎదురుచూస్తున్న డంప్ - ఓర్రీ మళ్ళీ ఫోటోషూట్ తో మ్యాజిక్ చేసాడు.. అంటూ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది.;
ఓర్రి అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీ ప్రపంచంలో అతడు ఒక డ్రగ్ లాంటోడు. అతడి ప్రేమ మత్తులోకి దిగని వారే లేరు. గాళ్స్ అందరూ అతడంటే పడి చస్తారు.
అంతగా ఓర్రీలో ఏం ఉంది? అంటే అదే అతడి ప్రత్యేకత. ఓర్రీ అందరి దృష్టిని ఎలా దోచుకోవాలో తెలిసిన వాడు. ఈవెంట్ ఏదైనా షోస్టాపర్ అతడు. తనదైన ట్రేడ్‌మార్క్ చిరునవ్వు, హావభావాలతో బోలెడంత ఫన్ పుట్టిస్తాడు. ముంబైలో ఈవెంట్ ఏదైనా అక్కడ ఓర్రీ హడావుడి అంతా ఇంతా కాదు.
ఇటీవల రూ. 14 లక్షల ఖరీదైన లగ్జరీ యాక్సెసరీని ధరించి కనిపించాడు. లాబ్‌స్టర్ లాగా కనిపించే ఒక లెదర్ బ్యాగ్ తో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అతడు ఓ ఈవెంట్లో అందాల భామలకు హగ్గులిస్తూ ప్రత్యక్షమయ్యాడు. తమన్నా, అనన్య పాండే, సుహానా ఖాన్, దిశా పటానీ లాంటి అందగత్తెలతో అతడి స్నాప్ లు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి, అత్యంత ఎదురుచూస్తున్న డంప్ - ఓర్రీ మళ్ళీ ఫోటోషూట్ తో మ్యాజిక్ చేసాడు.. అంటూ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా దూసుకెళుతోంది. ఓర్రీతో ఫోటోషూట్ సరే కానీ, ఓర్రీ ధరించిన స్పెషల్ డిజైనర్ డ్రెస్ చూసారా? బాలీవుడ్ లో రణవీర్ సింగ్, ఊర్ఫీ జావేద్ ని మించి అతడు ప్రయోగాలు చేస్తున్నాడు.
చూస్తుంటే అతడు మేల్ ఊర్ఫీలా కనిపిస్తున్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఓర్రీ టూమచ్ గా ప్రయోగాలు చేయడం అంత మంచిది కాదేమో! అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఓర్రీ ఇప్పట్లో తగ్గేట్టు కనిపించడం లేదు. ఓర్రీ కేవలం సోషల్ మీడియా స్టార్ గానే కాదు రియాలిటీ షోల పార్టిసిపెంట్ గాను ఫ్యాన్స్ కి చేరువవుతున్నాడు. మునుముందు అతడు నటనలోకి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం.