డిజిటల్ దుమారం: ఓరి- ధ్రువ్ రాఠీ వివాదం వెనుక అసలు కథ!
ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో సెలబ్రిటీలు- సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మధ్య మాటల యుద్ధాలు సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి.
ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో సెలబ్రిటీలు- సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల మధ్య మాటల యుద్ధాలు సరికొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఒకప్పుడు వ్యక్తిగత విభేదాలకో.. చిన్నపాటి ఈగోలకో పరిమితమైన ఈ వివాదాలు.. ఇప్పుడు దేశభక్తి, సిద్ధాంతాలు, రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయి. తమకు నచ్చని వారిపై పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ఘాటుగా విమర్శలు గుప్పించడం ద్వారా నెటిజన్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు ఇంటర్నెట్ వేదికలపై నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ప్రముఖులతో నిత్యం హల్‌చల్ చేసే ఓరి (ఓర్హాన్ అవత్రామణి), ప్రముఖ సామాజిక-రాజకీయ విశ్లేషకుడు ధ్రువ్ రాఠీల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇంటర్నెట్‌లో పెద్ద సంచలనంగా మారింది. ధ్రువ్ రాఠీని టార్గెట్ చేస్తూ ఓరి చేసిన కొన్ని వ్యాఖ్యలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో పెద్ద దుమారాన్నే లేపాయి. ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ సోషల్ మీడియా వాతావరణాన్ని విపరీతంగా హీటెక్కిస్తున్నారు.
ముఖ్యంగా ధ్రువ్ రాఠీని ఉద్దేశించి ఓరి యాంటీ నేషనల్ అని తీవ్రమైన కామెంట్ చేయడం ఈ వివాదానికి మరింత ఆద్యం పోసింది. గతంలోనూ ఇద్దరి మధ్య ఇదే తరహా ఆరోపణలు నడిచాయి. ఇప్పుడు మరోసారి ఓరి అదే పదాన్ని ఉపయోగించడంతో వీరి మధ్య ఉన్న పాత విభేదాలు ఎంత ముదిరిపోయాయో స్పష్టమవుతోంది. సాధారణ కంటెంట్ క్రియేటర్ల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన చర్చ దేశభక్తి ముసుగులో సిద్ధాంతాల ఘర్షణగా మారిపోయింది.
ఆన్‌లైన్ ఫైట్ కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ రియాలిటీ షో ఖత్రోన్ కే ఖిలాడీ వేదిక వరకు చేరడం విశేషం. గ్లామర్ ఇండస్ట్రీలో ఉనికిని కాపాడుకోవడానికి, నిరంతరం పబ్లిసిటీ సాధించడానికి కొందరు ప్రముఖులు ఇలాంటి వివాదాలను అస్త్రాలుగా వాడుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాపులారిటీ రేసులో నిలవడం కోసం ఎంతటి తీవ్ర ఆరోపణలైనా చేయడానికి వెనకాడకపోవడం గమనార్హం.
ఇలాంటి బహిరంగ గొడవల వల్ల ఇద్దరి ఫాలోవర్లు సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి పరస్పరం ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడుకోవడం, వ్యక్తిగత దూషణలు చేసుకోవడం వల్ల ఇంటర్నెట్ వాతావరణం పూర్తిగా కలుషితమవుతోంది. వినోదంతో పాటు మంచి సమాచారాన్ని అందించాల్సిన వ్యక్తులే ఇలాంటి వివాదాల వెనుక ఉండటం చూసి సాధారణ అభిమానులు కూడా గందరగోళానికి గురవుతున్నారు.
లక్షలాది మంది నెటిజన్లను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్లు సమాజం పట్ల బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే అయినా? వాటిని గౌరవప్రదమైన రీతిలో వ్యక్తపరచకుండా తీవ్రమైన పదజాలంతో దాడులు చేసుకోవడం సరైన పద్ధతి కాదు. ఈ తరహా వివాదాలు తాత్కాలికంగా అటెన్షన్ తెచ్చిపెట్టినా? సుదీర్ఘకాలంలో వారి వ్యక్తిగత ప్రతిష్టను మసక బారుస్తాయనేది వాస్తవం.