• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓం భీమ్ బుష్.. యూఎస్ లో...

ఓం భీమ్ బుష్.. యూఎస్ లో సూపర్ రెస్పాన్స్!

| దీంతో ఇప్పుడు ఈ చిత్రం కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-03-21 16:33 GMT

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తో పాటు కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ ఓం భీమ్ బుష్. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో వీరు ముగ్గురు బ్రోచేవారెవరురా సినిమాతో టాలీవుడ్ ప్రియులను ఓ రేంజ్ లో అలరించారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం కోసం మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ క్యూరియాసిటీని పెంచాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అధికారులు కూడా పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. దీంతో మూవీ సూపర్ హిట్ అవుద్దని అంతా నమ్మకంతో ఉన్నారు. సూపర్ హిట్ ట్రియో కామెడీని ఎంజాయ్ చేయడానికి మూవీ లవర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు.

అయితే ఈ సినిమాను అమెరికాలో అగ్రగామి డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో ఒకటైన గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ విడుదల చేస్తోంది. గ్రేట్ ఇండియా ఫిల్మ్స్.. యూఎస్ లో పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేస్తోంది. మార్చి 22వ తేదీన ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్ నేడు(మార్చి 21) ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రీమియర్ షోస్ కు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వీకెండ్ కు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అవుతుంది.

ఈ మూవీతో మరోసారి శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మ్యూజిక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తం సినిమాలో ఐదు బ్లాకులు కడుపుబ్బా నవ్విస్తాయట. ఇక దెయ్యం సీన్ అయితే ఓ రేంజ్ లో ఉంటుందోంట. కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ తో మూడు రెట్లు లాభం సంపాదించారట మేకర్స్. మొత్తానికి ఈ సినిమా.. పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్ గా మారనుందన్నమాట.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మించారు. సన్నీ ఎంఆర్ సంగీతం సమకూర్చగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేయగా.. విజయ్ వర్ధన్ ఎడిటర్ గా సేవలందించారు. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Ombheembush 
  • Sreevishnu 
  • Priyadarshi 
  • Rahulramakrishna 
  • Sreeharshakonuganti 
  • Vcelluloid 
  • Sunilbalusu 
  • USAPremieres 
  • GreatIndiaFilms 

Similar News

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

Copyright @2026

Powered by Blink CMS