పవన్ OG.. కాంతారకు గట్టి పోటీ తప్పదేమో!

ఎందుకంటే ఆ సినిమాకు ఇప్పటికే సినీ ప్రియులు తరలివెళ్తున్నారు. ఇప్పుడు కాంతార వచ్చే టైమ్ కు ఓజీ టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి.;

Update: 2025-09-26 12:30 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ప్రీమియర్స్ తో మూవీ సందడి మొదలవ్వగా.. గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పవన్ అభిమానులు తెగ మెప్పిస్తోంది.

మిగతా సినీ ప్రియులు కాస్త అప్సట్ అయినా.. వసూళ్ల విషయంలో మాత్రం ఓజీ అదరగొట్టేలా కనిపిస్తోంది. సినిమాపై భారీ హైప్ నెలకొనడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ జెట్ స్పీడ్ లో జరిగాయి. అదే సమయంలో ఫ్యాన్స్ రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు వెళ్తున్నారు. సినిమాను చూసి ఫుల్ గా చిల్ అవుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

ఏదేమైనా మిక్స్ డ్ రివ్యూస్ వస్తున్నా.. స్పందన మాత్రం బాగుంది. మరికొన్ని రోజులు ఇదే జోష్ కొనసాగేలా కనిపిస్తోంది. అయితే ఓజీ మూవీతో కాంతార చాప్టర్-1కు గట్టి పోటీ ఉండనుందని ఇప్పుడు అంచనాలు వస్తున్నాయి. బ్లాక్ బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమా.. వచ్చే వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటిస్తూనే.. దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను హోంబలే ఫిల్మ్స్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన మేకర్స్.. ప్రమోషన్స్ విషయంలో అనుకున్నంత స్పీడ్ లో లేరు. ట్రైలర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. కన్నడలో ఇటీవల మూడు ప్రెస్ మీట్స్ ను నిర్వహించారు.

మరికొద్ది రోజుల్లో తెలుగులో మూవీని ప్రమోట్ చేయనున్నారని తెలుస్తోంది. అలా ప్రమోషన్స్ ను స్పీడప్ చేస్తారని తెలుస్తోంది. అయితే కాంతారకు మాత్రం ఓజీతో సవాల్ తప్పదని అంతా అంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాకు ఇప్పటికే సినీ ప్రియులు తరలివెళ్తున్నారు. ఇప్పుడు కాంతార వచ్చే టైమ్ కు ఓజీ టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి.

దీంతో ఇంకొంతమంది కూడా వెళ్తారు. కాబట్టి మరో 10 రోజుల వరకు ఓజీ మూవీతో థియేటర్స్ అన్నీ కళకళలాడుతాయనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అయితే ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ తో కాంతార మూవీకి ఓపెనింగ్స్ మాత్రం భారీగానే రావడంలో సందేహం అక్కర్లేదు. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News