ఓజీ Vs అఖండ 2.. క్లారిటీ వచ్చేదెప్పుడో?

ఓజీ వర్సెస్ అఖండ 2.. గత కొద్ది రోజులుగా సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో దాని కోసమే డిస్కస్ చేసుకుంటున్నారు.;

Update: 2025-08-23 17:30 GMT

ఓజీ వర్సెస్ అఖండ 2.. గత కొద్ది రోజులుగా సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో దాని కోసమే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రకటనల ప్రకారం.. దసరా పండక్కి రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ఆయా చిత్రాల మేకర్స్ వెల్లడించారు.

రిలీజ్ కు మరో నెల రోజుల సమయం ఉంది. అయితే ఏంటి అనుకుంటున్నారా? ఇప్పటి వరకు రిలీజ్ ప్లాన్ పై క్లారిటీ లేదు. రెండు భారీ సినిమాలు కాబట్టి ఏదో ఒక మూవీ తప్పుకునే అవకాశం ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఏ సినిమా మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. అఫీషియల్ గా ప్రకటించడం లేదు.

ముఖ్యంగా అఖండ 2 వాయిదా పడుతుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయని.. అందుకే దసరాకు రిలీజ్ అవ్వడం కష్టమేనని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఓజీ షూటింగ్ పూర్తి కాగా.. ఒక సాంగ్ కూడా విడుదల చేశారు. కానీ అఖండ సీక్వెల్ సందడి మాత్రం లేదు.

అదే సమయంలో పవన్ , బాలయ్య ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌ లో ఒకే సంకీర్ణ ప్రభుత్వానికి చెంది నవారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బట్టి చూసినా రెండూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక మూవీ డ్రాప్ అవ్వడం పక్కా అని అంటున్నారు. అది అఖండ-2నే అవ్వవచ్చని చెబుతున్నారు. కానీ క్లారిటీ కోసం వెయిటింగ్.

కాగా, ఓజీ మూవీని ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు, బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ సీక్వెల్ గా అఖండ-2 రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా తమనే వర్క్ చేస్తున్నారు. మరి రాబోయే కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో.. ఎప్పుడు క్లారిటీ వస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News