• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG లో ప్రభాస్.. ఈ లింకు...

OG లో ప్రభాస్.. ఈ లింకు నిజమైతే పూనకాలే..?

| కానీ గూగుల్ లో మాత్రం 'ఓజీ' మూవీ క్యాస్టింగ్ అని టైప్ చేస్తే పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్, ఇమ్రాన్ హష్మి ఫోటోలని చూపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-10-19 05:58 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మరల వైజాగ్ లో స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని సుజిత్ భావిస్తున్నారు. రెండు భాగాలుగా 'ఓజీ' చిత్రాన్ని సుజిత్ తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడది సాధ్యం అవుతుందా లేదా అనేది క్లారిటీ లేదు.

ముందుగా 'ఓజీ' ఫస్ట్ పార్ట్ ఫినిష్ చేసి రిలీజ్ చేసాక సక్సెస్ అయితే తరువాత నెక్స్ట్ పార్ట్ గురించి ఆలోచించొచ్చు. ఇదిలా ఉంటే గతంలో 'ఓజీ' సినిమా కథకి ప్రభాస్ 'సాహో' కి లింక్ ఉందని, రెండు మల్టీ వర్స్ మూవీస్ గా సుజిత్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. 'ఓజీ' మూవీ స్టార్ట్ చేసిన సమయంలో ఈ టాక్ విస్తృతంగా సోషల్ మీడియాలో నడిచింది. అది ఎంత వరకు వాస్తవమనేది తెలియదు.

కానీ గూగుల్ లో మాత్రం 'ఓజీ' మూవీ క్యాస్టింగ్ అని టైప్ చేస్తే పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్, ఇమ్రాన్ హష్మి ఫోటోలని చూపిస్తుంది. ఈ స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ అభిమానులు ఈ స్క్రీన్ ని వైరల్ చేయడంతో పాటు ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

గూగుల్ తల్లి అబద్ధం చెబుతుందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కచ్చితంగా ఇలా మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తే సూపర్ గా ఉంటుందని రియాక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఓజీ ఉంది. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తాడనే దానిపై రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది.

ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ చిత్రంగా 'ఓజీ' సినిమాని సుజిత్ తెరకెక్కిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఇది ఈ సినిమాకి ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది దసరాకి మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Tags:    
  • Pawankalyan 
  • Prabhas 
  • Emranhasmi 
  • Ogmovie 
  • Ogmoviecast 
  • Tollywood 
  • Sujeet 
  • Movieshooting 
  • Vizag 
  • Google 
  • Multistarrer 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS