ఫ్యాన్స్ కు ట్రీట్ ఇవ్వనున్న భారీ ట్రైలర్లు
త్వరలోనే టాలీవుడ్ లో రాబోయే మూడు పెద్ద సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు నెట్టింట సందడి చేయనున్నాయి.;
టాలీవుడ్ సినీ ఫ్యాన్స్ కు రానున్న రోజులు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించనున్నాయి. త్వరలోనే టాలీవుడ్ లో రాబోయే మూడు పెద్ద సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు నెట్టింట సందడి చేయనున్నాయి. వాటిలో మొదటిగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా ట్రైలర్ రానుంది. సెప్టెంబర్ 21న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓజి ట్రైలర్ రిలీజ్ కానుంది.
ఓజి ట్రైలర్ పై భారీ అంచనాలు
సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుండగా ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తైంది. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఓజి యూఎ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఇప్పటికే ఓజిపై భారీ అంచనాలుండగా, ట్రైలర్ రిలీజయ్యాక ఓజిపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశముంది. ఇక సెప్టెంబర్ 22న కాంతార చాప్టర్1 ట్రైలర్ రిలీజ్ కానుంది.
స్టార్ హీరోల చేతుల మీదుగా కాంతార ట్రైలర్
2022లో బ్లాక్ బస్టర్ అయిన కాంతార సినిమాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటిస్తుండగా, కాంతార చాప్టర్1 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగే ఛాన్సుంది. దానికి తోడు ఈ ట్రైలర్ ను వివిధ భాషల్లో ప్రభాస్, హృతిక్ రోషన్, శివ కార్తికేయన్, పృథ్వీరాజ్ సుకుమారన్ రిలీజ్ చేస్తుండటంతో ట్రైలర్ కోసం కూడా అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారు.
కాంతార చాప్టర్1తో రాజా సాబ్ ట్రైలర్
ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హార్రర్ కామెడీ సినిమా ది రాజాసాబ్. ఈ సినిమా నుంచి మేకర్స్ రెండు ట్రైలర్లను రిలీజ్ చేయనుండగా, మొదటి ట్రైలర్ ను అక్టోబర్ 1న రిలీజ్ చేయనున్నారు. కాంతార చాప్టర్1 సినిమాతో పాటూ రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. జనవరి 9న రాజా సాబ్ రిలీజ్ కానుండగా, చాలా ముందుగానే ట్రైలర్ ను రిలీజ్ చేసి తమ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో హైప్ ను తీసుకురావాలని చూస్తోంది చిత్ర బృందం. ఈ మూడు ట్రైలర్ల కోసం ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.