అమెరికాలో OG.. ఉరమాస్ మ్యానియా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ మ్యానియా ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ మ్యానియా ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. గురువారం రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రి ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో పవర్ స్టార్ అభిమానులంతా ఓ రేంజ్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో ఓవర్సీస్ లో కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్.. థియేటర్స్ దద్దరిల్లేలా చేయనున్నారు. అందుకు గాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సంబరాలు కూడా స్టార్ట్ చేశారు. తాజాగా డల్లాస్ లో పవన్ యూత్ ఫ్యాన్స్.. ఓజీ రిలీజ్ మూమెంట్ ను ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
డల్లాస్ లో ఉంటున్న పవన్ ఫ్యాన్స్.. ఓజీ టైటిల్ అండ్ పవర్ స్టార్ ఫోటో ఉన్న టీ షర్ట్ వేసుకుని డ్యాన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ మూవీ ఖుషీలోని సూపర్ హిట్ సాంగ్.. అమ్మాయే సన్నగా.. అరనవ్వే నవ్వగా.. సాంగ్ కు స్టెప్పులు వేశారు. అంతకుముందు.. పవన్ భారీ కటౌట్ పెట్టి దండలు వేసి.. తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు.
అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు, సినీ ప్రియులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతున్నారు. తమ అభిమాన హీరో క్రేజ్ అంటే అదని ఫ్యాన్స్ చెబుతున్నారు. పవన్ మ్యానియా అంటూ సందడి చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ ఓజీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఓజీపై ఆడియన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా తాము ఇప్పటి వరకు తమ అభిమాన హీరోను ఎలా చూడాలని కోరుకున్నామో పవన్ ను ఇప్పుడు ఓజీ సినిమాలో అలానే డైరెక్టర్ సుజీత్ చూపించి ఉంటారని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి నిర్మించారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ లో కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, సిరి లెళ్ల తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించారు.