డిలే అయినా డ్రాప్ కాదు? ‘OG 2’పై బిగ్ బజ్
కొన్ని నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించి వచ్చిన వరుస అప్‌డేట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఓజి 2’. పవన్ సైతం ఎంతో ఇష్టపడి చేస్తున్న ఈ సినిమాను ఆయన అభిమాని అయిన దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే మధ్యలో ఈ సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రూమర్స్ వినిపించాయి. మరి ఆ రూమర్లలో నిజమెంత? ఓజి 2 లేటెస్ట్ అప్‌డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారీ హైప్ క్రియేట్ చేసిన అప్‌డేట్స్:
కొన్ని నెలల క్రితం ఈ సినిమాకు సంబంధించి వచ్చిన వరుస అప్‌డేట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. షూటింగ్ కూడా చాలా త్వరగానే షురూ అవుతుందనే వార్తలు గట్టిగా వినిపించాయి. ఇక దాంతో పవర్ స్టార్ మాస్ అవతారాన్ని మళ్లీ పెద్ద స్క్రీన్ పై చూడవచ్చని అభిమానులు ఎంతో సంబరపడిపోయారు.
నడుమ మొదలైన సస్పెన్స్, రూమర్స్ :
అయితే అనుకోకుండా పవన్ కళ్యాణ్ ఆరోగ్య సమస్యలు తలెత్తడం, మరోవైపు దర్శకుడు సుజీత్ నాచురల్ స్టార్ నానితో కొత్త సినిమా మొదలుపెడుతున్నారనే ప్రచారం జరగడంతో 'ఓజి 2' ఆలస్యం అవుతుందనే టాక్ నడిచింది. అసలు ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారేమో అని అభిమానుల్లో చిన్నపాటి అనుమానాలు, నిరాశ వ్యక్తమయ్యాయి.
అభిమానులకు ఊరటనిచ్చే తీపి కబురు :
కానీ ఫిలిం నగర్ నుంచి వస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఓజి 2 ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ప్రాజెక్ట్ లేట్ అయినా సరే డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నవంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.
ఈ ఏడాదే సెట్స్ మీదకి ‘ఓజి 2’ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నవంబర్ నుంచి డేట్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే, అన్ని సెట్ అయ్యి ఈ ఏడాది చివర్లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ వార్త తెలిశాక పవన్ ఫ్యాన్స్ మళ్లీ ఫుల్ జోష్‌లోకి వచ్చేశారు.
ఇక ఏది ఏమైనా ‘ఓజి 2’ ఆగిపోలేదు, కేవలం కాస్త ఆలస్యం మాత్రమే అవుతోందని తేలిపోవడంతో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక సుజీత్ మేకింగ్, పవన్ కళ్యాణ్ మాస్ మేనియా మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తాయో చూడాలంటే నవంబర్ వరకు ఆగాల్సిందే.