రూ.1000 కోట్ల మూవీ.. ఓటీటీ రిలీజ్ పై చర్చేంటి?
ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం కామన్.
ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం కామన్. ముఖ్యంగా థియేటర్లలో సంచలనం సృష్టించిన చిత్రాల విషయంలో అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి చర్చే బ్లాక్ బస్టర్ హిట్ సైకాలజికల్ హారర్ థ్రిల్లర్ అబ్సెషన్ చుట్టూ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న ఆ హాలీవుడ్ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది? థియేటర్లలో చూసిన వెర్షన్ నే విడుదల చేస్తారా? లేక ఎలాంటి కట్స్ లేకుండా వెర్షన్ తీసుకొస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఇటీవల వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత పెద్ద సర్ప్రైజ్ గా నిలిచిన చిత్రాల్లో అబ్సెషన్ ఒకటి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సైకాలజికల్ హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ చిత్రం విడుదలైన తర్వాత మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. అదే సినిమా విజయానికి మెయిన్ రీజన్ గా మారింది.
ఒక చిన్ననాటి బొమ్మ చుట్టూ తిరిగే కథను దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు. కోరిక నెరవేరిన తర్వాత వాటి ఎఫెక్ట్ ఎలా భయానకంగా మారుతుందనే అంశాన్ని చూపించారు. కథలోని సస్పెన్స్, భయపెట్టే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సాధిస్తున్న వసూళ్లు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
భారీ బడ్జెట్ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ అబ్సెషన్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి దాదాపు రూ.1000 కోట్ల మార్క్ కు చేరువైంది. చిన్న సినిమాగా ప్రారంభమైన ఆ చిత్రం ఇప్పుడు పెద్ద చర్చకు కారణమైంది. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టి ఓటీటీ విడుదలపైనే ఉంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్ కే మంచి రెస్పాన్స్ రావడంతో అదే వెర్షన్ ను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు కొంతమంది అభిమానులు మాత్రం ఎలాంటి కట్స్ లేకుండా పూర్తి వెర్షన్ ను విడుదల చేయాలని కోరుతున్నారు. గతంలో కొన్ని హాలీవుడ్ చిత్రాలు థియేటర్ల వెర్షన్స్ కాకుండా సెపరేట్ వెర్షన్లతో ఓటీటీల్లో విడుదలైన సందర్భాలు ఉన్నాయి. అందుకే అబ్సెషన్ విషయంలో కూడా అలాంటి అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది. కానీ సెన్సార్ ఆర్డర్ ప్రకారం, ఇండియాలో థియేటర్లలో ప్రదర్శించిన వెర్షన్ నే ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు.
అయితే ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి స్ట్రీమింగ్ డేట్ పై గానీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ పై గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన అబ్సెషన్ ఇప్పుడు ఓటీటీ రిలీజ్ చర్చలతో మరోసారి వార్తల్లో నిలిచింది. మరి స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారో, ఇండియాలో ఏ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.