చొక్కా విప్పి చలిలో తార‌క్!

అయితే తార‌క్ మ‌ళ్లీ చొక్కా విప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం చొక్కా విప్పి న‌టించాల్సి ఉంటుందిట‌.;

Update: 2025-12-12 15:46 GMT

చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపించి స‌న్నివేశాన్ని ర‌క్తి క‌ట్టించ‌డం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి కొత్తేం కాదు. తొలిసారి ఆ త‌ర‌హా అటెంప్ట్ `టెంప‌ర్` కోసం చేసాడు. ఆసినిమా కోసం పూరి జ‌గ‌న్నాధ్ తార‌క్ మేకోవ‌ర్ నే మార్చేసాడు. ఓ కొత్త లుక్ లో తార‌క్ ని తెర‌పై ఆవిష్క‌రించాడు. చొక్కా విప్పిన ద‌యాగాడు ప్ర‌త్యర్దుల‌ మీద ప‌డిపోవ‌డం..ప్రియురాలి మీద వాలిపోవ‌డం వంటి స‌న్నివేశాలు సినిమాలో పండాయి. దీంతో ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అదే హీరోతో త్రివిక్ర‌మ్ చొక్కా విప్పించాడు. ఇద్ద‌రి కాంబినేష‌న్ లో `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ` తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

ఆ మూడు సినిమాల అనంత‌రం:

ఆ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాల కోసం తార‌క్ చొక్కా విప్పి క‌త్తి ప‌ట్టి వెంట ప‌డి తెగ న‌రికే స‌న్నివేశాలు ఓ రేంజ్ లో పండాయి. తార‌క్ మాస్ అప్పిరియ‌న్స్ మ‌రోసారి ఆ సినిమాతో హైలైట్ అయింది. అనంత‌రం పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` లోనూ తార‌క్ చొక్కా విప్పి మెప్పించాడు. ఆ సినిమాలో తార‌క్ గొండు బిడ్డగా న‌టించాడు. త‌రుము కొస్తున్న పులి నుంచి త‌ప్పించుకునే స‌న్నివేశాల్లో భాగంగా లంగోటా క‌ట్టి అడ‌విలో ప‌రిగెత్తే సీన్స్ ఎంతో ర‌క్తి క‌ట్టాయి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ తార‌క్ చొక్కా విప్పాల్సిన అవ‌స‌రం ప‌డ‌లేదు. అలాంటి క‌థ‌లు ప‌డ‌లేదు.

20 రోజులు నైట్ షూట్ లోనే:

అయితే తార‌క్ మ‌ళ్లీ చొక్కా విప్పే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో భాగంగా ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ కోసం చొక్కా విప్పి న‌టించాల్సి ఉంటుందిట‌. ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో నైట్ షెడ్యూల్ రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. రెండు నెల‌ల గ్యాప్ అనంత‌రం టీమ్ షూటింగ్ కి సిద్ద‌మ‌వుతోంది. దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ జ‌ర‌గ‌నుంది. షూట్ అంతా రాత్రిపూటే ఉంటుంది. దీనిలో భాగంగా తార‌క్ తీవ్ర మైన చ‌లిలో చొక్కా విప్పి యాక్ష‌న్ స‌న్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలిసింది.

దేవ‌ర‌కు కాంట్రాస్ట్ గా:

మ‌రి వీటి కోసం తార‌క్ ఎలాంటి ముందొస్తు ప్ర‌ణాళిక‌తో వెళ్తాడో చూడాలి. `దేవ‌ర` షూటింగ్ లో భాగంగాతారక్ ఎంతో అసౌక‌ర్యానికి గురైయ్యాడు. మండే ఎండ‌ లో..అం దులోనూ స‌ముద్రంలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక రించారు. ఆ స‌మ‌యంలో తార‌క్ ఎంతో ఇబ్బంది ప‌డ్డాడు. ఎండ‌లో షూటింగ్ కావడంతో ఒళ్లంతా మంట‌తో ఇబ్బంది ప‌డ్డాడు. చిన్న ఏసీ గ‌ది అందుబాటులో ఉన్నా? ప‌వ‌ర్ క‌ట్ తో అందులో నూ ఉక్క‌బోత‌కు గుర‌య్యాడు. ఇప్పుడు `దేవ‌ర` షూటింగ్ కాంట్రాస్ట్ గా ప్ర‌శాంత్ నీల్ కోసం ఒణికించే చ‌లిలోకి దిగాల్సి వ‌స్తోంది.

Tags:    

Similar News