ఎన్టీఆర్ ఎంత అదృష్టవంతుడు.. ఉపాసన వ్యాఖ్య!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య స్నేహం గురించి తెలిసిందే.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్య స్నేహం గురించి తెలిసిందే. ఈ ఇద్దరి స్నేహం ఆన్ ద స్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్ బంపర్ హిట్టు. ఆర్.ఆర్.ఆర్ లో ఈ ఇద్దరి బ్రదర్ హుడ్ గొప్పగా వర్కవుటవ్వడం గురించి చాలా ఆసక్తికర చర్చ సాగింది. కొన్నేళ్లుగా వారి మధ్య స్నేహానుబంధం కొనసాగుతోంది. తారక్ - చరణ్ మాత్రమే స్నేహితులు కాదు.. ఇరు కుటుంబాల నడుమా మంచి స్నేహం కొనసాగుతోంది. ఒకరి ఫ్యామిలీలో ఫంక్షన్లకు ఒకరు అటెండవుతుంటారు. అలాగే ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తుంటారు. లండన్, దుబాయ్, యూరప్ లేదా ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా, వెకేషన్ కోసం కుటుంబాలు కలిసి వెళ్లడం లేదా హైదరాబాద్ లో జరిగే భారీ వేడుకలు, ఫంక్షన్లలో కలిసి సందడి చేస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.
అయితే కుటుంబాల మధ్య స్నేహమే మాత్రమే కాదు.. చరణ్, ఎన్టీఆర్ ల భార్యల మధ్య స్నేహం కూడా నిరంతరం అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది. ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మాట్లాడుతూ, ఎన్టీఆర్ భార్యామణి లక్ష్మీ ప్రణతిపై ప్రశంసలు కురిపించారు. లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు అని ఉపాసన కాంప్లిమెంట్ ఇచ్చారు. లక్ష్మీ ప్రణతి ఎంతో స్వీట్ పర్సన్. దగ్గరుండి ప్రతిదీ చూసుకుంటుంది. బలమైన వ్యక్తిత్వం ఉన్న మహిళ ! అని కూడా కితాబిచ్చారు ఉపాసన. అందుకు సంబంధించిన త్రోబ్యాక్ వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ జన్మించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ టాలీవుడ్ లో సమాంతరంగా కెరీర్ జర్నీ సాగిస్తున్నారు. నేడు భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన పాన్ ఇండియన్ హీరోల జాబితాలో ఆ ఇద్దరూ ఉన్నారు. లండన్ లో రామ్ చరణ్ వ్యాక్స్ స్టాట్యూ ఆవిష్కరణలోను ఎన్టీఆర్ సందడి చేసిన సంగతి తెలిసిందే.