తారక్ అంతా నైట్ షూట్ లోనేనా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్`, `సలార్` తర్వాత ప్రశాంత్ నీల్ ప్రేక్షకుల్ని ఎలాంటి వరల్డ్ లోకి తీసుకెళ్తాడు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ప్రపంచం ఎలా ఉన్నా? యశ్, ప్రభాస్ ని మించిన యాక్షన్ స్టార్ గా తారక్ ను చూపిస్తాడు? అన్నది వాస్తవం. తారక్ అభిమానులు ఈ విషయంలో ఎంతో కాన్పిడెంట్ గా ఉన్నారు. తారక్ ని అభిమానించే నీల్ చేస్తోన్న చిత్రం కావడం మరో విశేషం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయింది. అయితే రెండు నెలలుగా ఎలాంటి షూటింగ్ చేయకుండా బ్రేక్ ఇచ్చారు.
తారక్ పై ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్:
దీంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. అవన్నీ పక్కన బెడితే తాజాగా రామోజీ ఫిలిం సిటీలో మరో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ షెడ్యూల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఇది పూర్తిగా నైట్ షెడ్యూల్ అట. తారక్ పై రాత్రిపూట చిత్రీకరించాల్సిన యాక్షన్ సన్నివేశాలని తెలిసింది. 20 రోజులు పాటు కేవలం రాత్రి మాత్రమే షూటింగ్ జరుగుతుందిట. ఇవన్నీ తారక్ పాత్రకు సంబంధించి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అని అంటున్నారు. ఇవి భారీ యాక్షన్ సన్నివేశాలుట. సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సన్నివేశాలు కూడా ఇవేనని తెలుస్తోంది.
ప్రకటించిన తేదీకే రిలీజ్:
ఈ సన్నివేశాల కోసమే తారక్ ప్రత్యేకంగా సన్నధం అయ్యారు. లుక్ పరంగా బాగా స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు. ఈ సమయంలో మరీ ఇంత సన్నగా మారుతున్నాడు? ఏంటి అనే సందేహాలు వ్యక్తమైనా క్లారిటీ రాలేదు. ఈ షెడ్యూల్ తో క్లారిటీ వచ్చింది. దీంతో మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తవుతందిట. అనంతరం పాటల చిత్రీకరణ ఉంటుందని సమాచారం. అటుపై పెండింగ్ సన్నివేశాలతో పాటు, హీరోయిన్ రుక్మిణీ వసంత్ పై కొన్ని సోలో సన్నివేశా లుంటాయని తెలిసింది. మొత్తంగా తాజా అప్ డేట్ తో చాలా విషయాలే బయటకు వచ్చాయి. దీంతో సినిమా అనుకున్న తేదీకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.
ఈసారి కాస్త వేగంగానే:
ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ చెప్పిన తేదీకి రిలీజ్ అవ్వడం అన్నది జరగదు. ప్రశాంత్ నీల్ గత సినిమాలు ఇలాగే వాయిదా పడ్డాయి. షూటింగ్ డిలేతోనే ఇలా జరిగేది. కానీ తారక్ సినిమా విషయంలో మాత్రం ఈ రెండు నెలల గ్యాప్ తప్ప పెద్దగా రెస్ట్ తీసుకోలేదు. ఈ క్రమంలో షూటింగ్ వేగంగా జరిగింది. మధ్యలో రెండు నెలల గ్యాప్ లేకపోతే షూటింగ్ జనవరి కల్లా పూర్తయ్యేది అన్న మాట కూడా వినిపిస్తోంది.